Reading Time: < 1 minute

సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్బీ చౌదరి రోడ్డు ప్రమాదంలో మృతి

Caption of Image.

హైదరాబాద్: సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత, ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజస్తాన్లోని ఉదయ్ పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. తెలుగు సినీ ప్రేక్షకులకు సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఎంత సుపరిచితమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేరుకు తగ్గట్టు గానే మంచి సందేశాత్మక చిత్రాలకు ఈ ప్రొడక్షన్ హౌస్ పెట్టింది పేరు. 

సుస్వాగతం, సూర్య వంశం, రాజా, శీను, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, ప్రియమైన నీకు, సింహరాశి, స్నేహమంటే ఇదేరా, సంక్రాంతి, అన్నవరం, నవ వసంతం, గోరింటాకు, భీమిలి కబడ్డీ జట్టు, రచ్చ.. ఈ సినిమాలన్నీ Super Good Films నిర్మాణంలో తెరకెక్కినవే కావడం గమనార్హం.

‘రంగం’ హీరో జీవా ఆర్ బీ చౌదరి కొడుకే. తమిళనాడు ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసిన విజయ్కు ఒక విధంగా లైఫ్ ఇచ్చింది ఆర్ బీ చౌదరినే. విజయ్ హీరోగా ఆర్ బీ చౌదరి ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ దాదాపుగా సంచలన విజయాలను నమోదు చేశాయి.

©️ VIL Media Pvt Ltd.