Reading Time: < 1 minute
Ctress Supritha Health Issues And Career Ambitions Interview

ఈమె ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కుమార్తెగా అందరికీ సుపరిచితురాలు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో తక్కువ కాలంలోనే మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈమె, ఇప్పుడు సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సుప్రిత.. తాను ఎదుర్కొన్న తీవ్ర అనారోగ్య సమస్యల గురించి ఆవేదన వ్యక్తం చేసింది.

సుప్రిత మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్స్ వల్ల మానసిక ఒత్తిడికి లోనై, బరువు తగ్గాలనే ఆరాటంలో నా ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకున్న. రోజుకు 15 గంటల పాటు ఏమీ తినకుండా ఉండి, తిన్న ఒక్క పూట కూడా బిర్యానీ వంటి హెవీ ఫుడ్ తీసుకోవడంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నదని వెల్లడించింది. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురై 15 రోజుల పాటు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. రోజుకు 15 సార్లు వాంతులు అవుతూ నీళ్లు తాగినా పడక నరకం అనుభవించా. ఒక దశలో ఆ బాధ భరించలేక నను చంపేయమని కోరుకున్నా’ అని ఆమె షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.

ప్రస్తుతం కోలుకున్న సుప్రిత తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా, మంచి స్క్రిప్ట్ దొరికితే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంటి పెద్ద హీరోల చిత్రాలలో చెల్లెలి పాత్రలు వచ్చినా వదులుకోనని స్పష్టం చేసింది. అయితే, తనకు ఇష్టమైన విజయ్ దేవరకొండ, అఖిల్ అక్కినేనిల సరసన మాత్రం సిస్టర్ పాత్రలు చేయడం కష్టమని ఆమె సరదాగా వ్యాఖ్యానించింది.