Reading Time: < 1 minute
Balakrishna Slashes Remuneration For Gopichand Malineni Film

టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా రెమ్యునరేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా స్టార్ హీరోలు తమ పారితోషికాన్ని పెంచుకుంటూ పోతుంటారు కానీ బాలయ్య మాత్రం తన తదుపరి చిత్రం కోసం రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ 2: తాండవం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ  బాలయ్య మాస్ పవర్ వల్ల రూ. 75 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే సినిమా బడ్జెట్ దాదాపు రూ. 120-150 కోట్ల వరకు ఉండటంతో, వసూళ్లు బాగున్నా బడ్జెట్ పరంగా ఇది కాస్ట్ ఫెయిల్యూర్‘  మూవీగా మిగిలిపోయింది. ఈ సినిమా కోసం బాలయ్య దాదాపు రూ. 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్.

‘అఖండ 2’ ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని NBK 111 విషయంలో బాలయ్య చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ రూ. 70 నుంచి 80 కోట్ల లోపే పూర్తయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య తన రెమ్యునరేషన్‌ను రూ. 40 కోట్ల నుంచి రూ. 30 కోట్లకు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. సినిమా మేకింగ్ లో కంప్రమైజ్ కాకుండా  అలానే నిర్మాతకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. బడ్జెట్ నియంత్రణలో భాగంగా హీరోయిన్ విషయంలోనూ మార్పులు జరిగాయి. మొదట ఈ సినిమాలో నయనతారను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఆమె రెమ్యునరేషన్ దాదాపు రూ. 8.5 కోట్లు కావడంతో అంత భారీ మొత్తం ఇస్తే బడ్జెట్ పెరిగిపోతుందని చిత్ర యూనిట్ భావించింది. దీంతో నయనతార స్థానంలో కాజల్ అగర్వాల్‌ను సంప్రదించగా కేవలం రూ. 1.5 కోట్ల పారితోషికానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.