
Highest IPL Run Chases: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో భారీ లక్ష్యాలను ఛేదించడం ఎప్పుడూ కఠిన సవాలే. కానీ కొన్ని జట్లు మాత్రం అసాధారణ బ్యాటింగ్‌తో ఆ సవాళ్లను సులభంగా అధిగమిస్తూ.. కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ ఈ విషయంలో అగ్రస్థానంలో నిలుస్తూ మరోసారి చరిత్రను తిరగరాసింది. ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఏకంగా 265 పరుగుల లక్షాన్ని ఈజీగా ఊదేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ కింగ్స్ అసాధారణ ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో రెండు వికెట్స్ కోల్పోయి 264 భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలోనే 6 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక విజయవంతమైన ఛేజ్‌గా నిలిచింది. ఇంతకుముందు కూడా ఈ రికార్డు పంజాబ్ పేరు పైనే ఉంది. 2024లో కోల్‌కతాపై 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ విజయవంతంగా ఛేదించింది. ఈ రెండు రికార్డులు పంజాబ్ బ్యాటింగ్ ఎంత పటిష్టంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. ఐపీఎల్‌లో టాప్-2 స్థానాలు పంజాబ్ జట్టువే కావడం విశేషం.
ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. 2025లో పంజాబ్‌పై 246 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ఛేదించింది. 2026లో రాజస్థాన్ రాయల్స్‌పై 229 పరుగుల లక్ష్యాన్ని జైపూర్‌లో విజయవంతంగా ఛేదించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2025లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 228 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ రికార్డులు చూస్తే.. ఐపీఎల్‌లో బ్యాటింగ్ ఎంతటి ప్రభావం చుసుపుతుందో అర్థమవుతోంది. భారీ లక్ష్యాలు కూడా సాధ్యమే అన్న రీతిలో ప్రస్తుత టీమ్స్ ఆడుతున్నాయి. పంజాబ్, హైదరాబాద్ జట్లు పరుగుల వరద పారిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఐపీఎల్‌లో విజయవంతమైన ఛేజింగ్‌లు:
265 – పీబీకేఎస్ వర్సెస్ డీసీ, ఢిల్లీ, 2026
262 – పీబీకేఎస్ వర్సెస్ కేకేఆర్, కోల్‌కతా, 2024
246 – ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ పీబీకేఎస్, హైదరాబాద్, 2025
229 – ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్ఆర్, జైపూర్, 2026
228 – ఆర్‌సీబీ వర్సెస్ ఎల్‌ఎస్‌జీ, లక్నో, 2025