
Aiden Markram Over: ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కు ఎదురుదెబ్బలు కొనసాగుతూనే ఉన్నాయి. ముల్లాన్ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల భారీ తేడాతో లక్నోను చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో లక్నో పరాజయానికి ప్రధాన కారణంగా ఎయిడెన్ మార్క్‌రమ్ వేసిన ఒకే ఒక్క ఖరీదైన ఓవర్ నిలిచింది. మ్యాచ్ ఆరంభంలో మాత్రం మహమ్మద్ షమీ తొలి ఓవర్లోనే ప్రభ్ సిమ్రన్ సింగ్ ను గోల్డెన్ డక్‌గా ఔట్ చేసి శుభారంభం అందించాడు. కానీ ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కానొల్లి జంట లక్నో బౌలర్లపై విరుచుకుపడి మ్యాచ్‌ను వన్ సైడ్ చేసేశారు. వీరిద్దరూ ఆడిన తీరు చూస్తే ఏదో వీడియో గేమ్ ఆడుతున్నట్టే అనిపించింది.
కళ్లు చెదిరే స్టంపింగ్‌తో MS Dhoni ని గుర్తుచేసిన Dhruv Jurel.!
కెప్టెన్ రిషభ్ పంత్ తీసుకున్న బౌలింగ్ మార్పులు కూడా జట్టుకు నష్టంగా మారాయి. ముఖ్యంగా సరైన సమయంలో సరైన బౌలర్ ను ఉపయోగించకపోవడం తీవ్రంగా ప్రభావం చూపింది. 13వ ఓవర్లో మార్క్‌రమ్ ను బౌలింగ్ కు తీసుకురావడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆ ఓవర్లో కూపర్ కానొల్లి వరుసగా మూడు సిక్సర్లు బాదగా.. ఆ తర్వాత వైడ్, సింగిల్ వచ్చింది. ఆపై ప్రియాన్ష్ ఆర్య మరో రెండు సిక్సర్లు కొట్టడంతో మొత్తం 32 పరుగులు వచ్చాయి. దీనితో ఈ ఓవర్ ఐపీఎల్ 2026 లోనే అత్యంత ఖరీదైన ఓవర్ గా నిలిచింది. అంతేకాదు ఒక ఓవర్‌లో 5 సిక్సర్లు ఇచ్చిన బౌలర్ల జాబితాలో కూడా మార్క్‌రమ్ చేరాడు.
PBKS vs LSG: ఆగని పంజాబ్ జోరు.. LSGపై భారీ విజయం.!
ఈ ఓవర్‌తో మ్యాచ్ పూర్తిగా పంజాబ్ వైపు మొగ్గుచూపింది. చివరకు పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 254 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ప్రియాన్ష్ ఆర్య 93 పరుగులు, కూపర్ కానొల్లి 87 పరుగులతో చెలరేగారు. అనంతరం 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 200 పరుగులకే పరిమితమైంది. రిషభ్ పంత్ (43), మార్ష్ (40), బదోని (35) పోరాడినప్పటికీ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్, వైశాఖ్, చాహల్ తలో వికెట్ సాధించారు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో తొలి 6 మ్యాచ్‌ల్లో ఓటమి లేకుండా కొనసాగిన తొలి జట్టుగా నిలిచింది.