
టాలీవుడ్‌లో తన పవర్‌ఫుల్ డైలాగ్స్, ఇంటెన్సివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు పూరీ జగన్నాథ్. ఒకప్పుడు టాప్ డైరెక్టరైన పూరీ.. గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం పూరీ ఆశలన్నీ ‘స్లమ్ డాగ్’ చిత్రంపైనే పెట్టుకున్నారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయింది. కానీ విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. దానికి పలు కారణాలు వినిపిస్తున్నా.. అసలు రీజన్ మాత్రం డిజిటల్ రైట్స్ అని తెలుస్తోంది.
స్లమ్ డాగ్ సినిమా ఓటీటీ డీల్ ఇంకా క్లోజ్ కాలేదని సమాచారం. సాధారణంగా ఈ మధ్య ఏ సినిమా అయినా సరే.. థియేటర్లలోకి వచ్చే ముందే డిజిటల్ డీల్ క్లోజ్ చేసుకుంటున్నాయి. స్లమ్ డాగ్ విషయంలో కూడా మేకర్స్ ఇదే ప్లాన్ చేస్తున్నారు. విడుదల తేదీని ప్రకటించే ముందే ఒక ప్రముఖ ఓటీటీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఓటీటీ డీల్ ఇంకా సెట్ కాలేదని సమాచారం. ఇది కంప్లీట్ అయితే అధికారికంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించే ఛాన్స్ ఉంది.
Also Read: Ram Pothineni New Movie: డైరెక్టర్ వేటలో రామ్ పోతినేని.. ఎప్పటికి దొరికేనో!
అయితే ఇప్పటికీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చుట్టూ ‘లైగర్’ నష్టాల వివాదం ఉంది. దానికి తోడు ఇప్పుడు స్లమ్ డాగ్ ఓటీటీ కష్టాల్లో ఉండడంతో.. అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి తనదైన వైవిధ్యమైన నటనతో అలరించబోతున్నారు. ఆయనతో పాటు సీనియర్ నటి టబు, మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రల్లో నటించారు.