Reading Time: 2 minutes
Rohit Sharma Injury Update Will Mi Star Play Vs Pbks Practice Video Goes Viral

Rohit Sharma: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి వార్తల్లో నిలిచాడు. నేడు (గురువారం) వాంఖెడే స్టేడియంలో జరిగే ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ (PBKS) మ్యాచ్‌కు ముందు ఆయన ఆడుతాడో లేదో అన్న అనుమానాలు నెలకొన్నాయి. పరిస్థితి ఇలా ఉంటే నిన్న (బుధవారం) మాత్రం ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ పాల్గొన్నాడు. అంతేకాదు రోహిత్ అక్కడ చేసిన ఫన్నీ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Early Retirement Plan: 45 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకోవాలా? ఈ 5 ఆర్థిక సూత్రాలు పాటిస్తే మీరు ధనవంతులే..

గత ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌ లో బ్యాటింగ్ చేస్తూ రోహిత్ శర్మ హ్యామ్‌ స్ట్రింగ్ సమస్యతో మైదానం వీడిన విషయం తెలిసిందే. దీంతో అతను పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా..? లేదా..? అన్నది సందేహంగా మారింది. మంగళవారం ప్రాక్టీస్‌కు కూడా హాజరుకాకపోవడంతో గాయం తీవ్రతపై చర్చలు మరింత పెరిగాయి.

అయితే బుధవారం రోహిత్ శర్మ మళ్లీ ప్రాక్టీస్‌లో కనిపించడం అభిమానులకు కొంత ఊరటనిచ్చింది. వాంఖెడే స్టేడియంలో వార్మప్ డ్రిల్స్ చేస్తూ, నెట్ ప్రాక్టీస్‌లో బ్యాటింగ్ కూడా చేశాడు. దీంతో మ్యాచ్‌కు ఆడే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు కనిపించాయి. ప్రాక్టీస్ సమయంలో చేసిన ఫిట్‌నెస్ డ్రిల్‌ లో భాగంగా కాళ్లను పైకి లేపుతూ ముందుకు కదులుతూ ఉండగా, రోహిత్ ఒక్కసారిగా ఫన్నీగా డాన్స్ చేయడం వీడియోలో కనిపించింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను అభిమానులు.. హమ్మయ్య మా రోహిత్ బాగుండడమే కాదు, స్టెప్స్ బలే చేశారు అంటూ తెగ చర్చ జరుగుతుంది.

OnePlus Pad 4: వన్ ప్లస్ ప్యాడ్ 4 లాంచ్ డేట్ ఫిక్స్.. స్నాప్ డ్రాగన్ 8 Elite, 13,380mAh బ్యాటరీతో పవర్‌హౌస్!

అయితే ఈ వీడియోలో రోహిత్ తొడ భాగంలో బ్యాండేజ్ కనిపించడం మరోసారి ఆందోళన కలిగిస్తోంది. గాయం పూర్తిగా తగ్గలేదనే సంకేతాలు కనిపించడంతో, పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌ లో అతని పాల్గొనడం పై సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి.