
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ ఇప్పటివరకు ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతి మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు అద్భుత ప్రదర్శన చేస్తుండడం జట్టుకు పెద్ద బలంగా మారింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆర్‌సీబీ తరఫున పలువురు ఆటగాళ్లు అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకున్నారు. అయితే అవార్డులను గెలుచుకున్న ప్లేయర్స్ అందరూ విదేశీ క్రికెటర్లే కావడం గమనార్హం.
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో జేకబ్ డఫీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై జరిగిన పోరులో టిమ్ డేవిడ్ తన పవర్ హిట్టింగ్‌తో జట్టుకు విజయం అందించి అవార్డు సొంతం చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్‌పై ఫిల్ సాల్ట్ అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై జోష్ హేజిల్‌వుడ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించి అవార్డు దక్కించుకున్నాడు. ఇలా ప్రతి మ్యాచ్‌లో వేర్వేరు ఆటగాళ్లు రాణించడంతో ఆర్‌సీబీ విజయాలు అందుకుంటుంది.
2025 నుంచి ఇప్పటివరకు ఆర్‌సీబీ తరఫున మొత్తం 10 మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకున్నారు. ఇన్ని అవార్డులు మరే జట్టుకు సాధ్యం కాలేదు. ఓ ఆటగాడిపై ఆధారపడకుండా మొత్తం జట్టు సమిష్టిగా రాణించడం వల్లే ఆర్‌సీబీకి ఈ విజయాలు సాధ్యమవుతున్నాయి. ఈ ట్రెండ్ కొనసాగితే ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ టైటిల్ రేసులో నిలవడం ఖాయం. జట్టులో ప్రతి ఆటగాడు మ్యాచ్‌ను గెలిపించే సామర్థ్యం కలిగి ఉండడం ఆర్‌సీబీకి అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.