Reading Time: < 1 minute
Mollywood Star Mohanlal Even At 65 Years Old He Is Doing Back To Back Movies Forgetting The Word Rest

మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ జోష్ అండ్ జోరును యంగ్ హీరోలు బీట్ చేయలేరేమో..? 65 ఇయర్స్‌లో కూడా రెస్ట్ అనే పదాన్ని మర్చిపోయి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. గత ఏడాది హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ కొల్లగొట్టిన లాలట్టన్ జోరుకు గట్టి బ్రేకులేసింది వృషభ. కానీ ఈ ఫ్లాప్ ఆయన కెరీర్‌పై పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. ఈ ఏడాది కూడా ఇదే జోరు చూపించేందుకు ప్లానింగ్ సిద్ధం చేసుకున్నారు. కానీ కేరళ ఎన్నికలు, పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం వల్ల దృశ్యం3, మల్టీస్టారర్ ఫిల్మ్ పేట్రియాట్ వాయిదా పడ్డాయి.

Also Read : Ustaad Bhagat Singh OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఉస్తాద్.. ట్రోలింగ్ తప్పేలా లేదుగా

తన ఫ్రెండ్ మమ్ముట్టితో కలిసి నటించిన పేట్రియాట్ మే1న రిలీజ్ అవుతుండగా.. దృశ్యం3 మే 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దృశ్యం3తో మరోసారి జీతూ జోసెఫ్‌తో చేతులు కలిపిన లాలట్టన్.. తన అప్ కమింగ్ మూవీకి తరుణ్ మూర్తిని రిపీట్ చేస్తున్నాడు. గత ఏడాది ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన తుడరుమ్ బ్లాక్ బస్టర్ నమోదు చేయడంతో ఆ దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చాడు లాలట్టన్. ఎల్366గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి అతి మనోహరం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఓ వైపు తన సినిమాలు చేస్తూనే.. ఎవరైనా క్యామియో రోల్ ఆఫర్ చేస్తే కాదనలేకపోతున్నాడు. గతంలో జైలర్, కన్నప్ప, భా భా బా మూవీలో స్పెషల్ రోల్స్‌లో మెరిశారు. జైలర్‌లో కాసేపు కనిపించిన లాలట్టన్.. జైలర్2లో కూడా క్యామియోను కంటిన్యూ చేయబోతున్నాడు. పృధ్వీరాజ్ సుకుమార్ తెరకెక్కించే ఖలీఫా, జయసూర్య, అనుష్క జంటగా నటిస్తోన్న కథనార్‌లో కూడా కీ రోల్ చేయబోతున్నాడట. ఇంత బిజీలో కూడా స్పెషల్ రోల్స్ చేస్తూ క్యామియో కింగ్‌గా మారాడు లాలట్టన్.