Reading Time: < 1 minute
Ms Raju Mystical Divine Thriller Agadha Shooting Completed Update

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్ బస్టర్స్ అందించిన మేకర్ ఎం.ఎస్. రాజు, గత కొంతకాలంగా విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘అగధ (Agadha)’ అనే చిత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీన్ని ఒక ‘మిస్టికల్ డివైన్ థ్రిల్లర్’ గా అభివర్ణిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.ఈ సినిమా టెక్నికల్ పరంగా చాలా గ్రాండ్‌గా ఉండబోతోంది. మొత్తం 85 రోజుల పాటు వివిధ రకాల సెట్స్, లొకేషన్లలో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. మరీ ముఖ్యంగా, సినిమాలో సుమారు 45 నిమిషాల పాటు వీఎఫ్ఎక్స్ (VFX) సన్నివేశాలు ఉండటం విశేషం.

Also Read : Ramayana Movie:’రామాయణ’ షూటింగ్ పై రాకింగ్ స్టార్ యష్ షాకింగ్ రివీల్

ఇక మిస్టరీ, దైవత్వం కలగలిసిన కథ కావడంతో విజువల్స్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎం.ఎస్. రాజు ఈ చిత్రాన్ని మలుస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన అనౌన్స్‌మెంట్ వీడియో పోస్టర్ చూస్తుంటే, ఒక అమ్మాయి 12 చేతులున్న భారీ విగ్రహం ముందు నిలబడి ఉండటం సినిమాలో ఏదో తెలియని రహస్యం ఉందనిపిస్తోంది. కాశీ విశాలాక్షి బాలుసు ‘శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కిన్ అరుల్ దేవ్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాలో నటించిన నటీనటుల వివరాలను మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌లో ఉంచారు. త్వరలోనే వారి వివరాలను వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.