Reading Time: < 1 minute
Mahesh Babu Rajamouli Movie Shooting At Devara Underwater Sets

ప్రస్తుతం ఇండియన్ సినిమా పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమా ఒకటి. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలను నెలకొల్పింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే,

Also Read : Kayadu Lohar: సాయి అభ్యంకర్ ఫోన్ కాల్ కారణంగా..రెండు రోజులు నిద్ర లేదు..

సాధారణంగా రాజమౌళి సినిమాల్లో విజువల్స్, గ్రాఫిక్స్ అత్యున్నత స్థాయిలో ఉంటాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం కూడా ఆయన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో పాటు భారీ సెట్టింగులను హైదరాబాద్‌లోనే సిద్ధం చేశారు. అయితే, ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా కోసం ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్స్‌ను ఇప్పుడు రాజమౌళి తన సినిమా షూటింగ్ కోసం వాడుకుంటున్నారట. కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన ప్రత్యేకమైన అండర్ వాటర్ స్టూడియో సెట్ రాజమౌళి విజన్‌కు సరిగ్గా సరిపోవడంతో, అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని, అందులో భాగంగానే ఈ అండర్ వాటర్ షూట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.