Reading Time: 2 minutes
Ap Inter Results 2026 To Be Released Tomorrow At 1031 Am Check Via Website And Whatsapp

AP Inter Results 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు రేపటితో తెరపడనుంది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను బుధవారం (ఏప్రిల్ 15) అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. విద్యార్థులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఫలితాలు, రేపు ఉదయం 10:31 గంటల నుండి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని, పరీక్ష ఫలితాలను వివిధ మార్గాల ద్వారా తెలుసుకోవచ్చని వివరాలను పొందుపరిచారు.

Redmi R70m 5G: రెడ్‌మీ R70m 5G రిలీజ్.. 6,300mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే

విద్యార్థులు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ resultsbie.ap.gov.in లో తమ హాల్ టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని తెలిపారు. వెబ్‌సైట్ ఫలితాల సమయంలో బిజీగా ఉండే అవకాశం ఉన్నందున, ఓపికగా ఉండాలిసిందే. అలాగే ఈ ఏడాది ఫలితాలను మరింత సులభంగా తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. విద్యార్థులు/ వారి తల్లిదండ్రులు ‘మొబైల్ ఫోన్’ వాట్సాప్ యాప్ లో (9552300009) నెంబర్‌కు కేవలం “Hi” అని మెసేజ్ పంపడం ద్వారా మీ ఫలితాలను క్షణాల్లో తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు.

CSK Vs KKR: చిదంబరం స్టేడియంలో బ్యాటింగ్ చేయనున్న CSK.. ఖాతా తెరిచే పనిలో కేకేఆర్..

ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ప్రతీ విద్యార్థికీ మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. “ఇది మీ క్షణం. రాణించండి. అల్ ది బెస్ట్” అని తన పోస్టులో పేర్కొన్నారు. కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులారా మీ హాల్ టికెట్ నెంబర్ సిద్ధంగా ఉంచుకోండి. రేపు ఉదయం 10:31 గంటల నుండి అధికారిక వెబ్‌సైట్ లేదా వాట్సాప్ ద్వారా మీ ఫలితాలను తెలుసుకోండి.