Reading Time: < 1 minute
Lok Sabha Seats Increase 850 Delimitation 2029 India

Lok Sabha Seats: కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కీలక ప్రతిపాదన చేసింది. లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం లోక్‌సభ స్థానాలు 543 ఉన్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి అన్ని చర్యల్ని తీసుకుంటోంది. రాష్ట్రాలకు 815 ఎంపీ సీట్లతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు 35 లోక్‌సభ సీట్లను కేటాయించనున్నారు. ఇందులో 33 శాతం మహిళలకు కేటాయించనున్నారు. పెరిగే సీట్ల సంఖ్య 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి అమలులోకి రానున్నాయి.

Read Also: Vijayawada: కలెక్టరేట్‌లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!

ఈ నెల 16 నుంచి 18 వరకు ఈ పెంపు గురించి కీలక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించనున్నారు. 131 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సీట్ల సంఖ్యను పెంచనున్నారు. ఆర్టికల్ 55,81లకు సవరణలకు సంబంధించి కేంద్రం సర్క్యులర్ జారీ చేసింది. ఆర్టికల్ 55 ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని, ఆర్టికల్ 81 లోక్‌సభ స్థానాల సంఖ్య, నియోజకవర్గాల్లో జనాభాను వివరిస్తుంది. రాజ్యాంగ సవరణ గురించి ఇప్పటికే అందరు ఎంపీలకు సమాచారం అందింది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్‌ గురించి చర్చించనున్నారు.