Reading Time: < 1 minute
Rohit Sharma Injury Update Mi Star Likely To Miss Pbks Clash In Ipl 2026

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం (హామ్‌స్ట్రింగ్ గాయం) కారణంగా ఏప్రిల్ 16న వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రిపోర్టుల్లో హామ్‌స్ట్రింగ్ గాయం తీవ్రమైనదని తేలితే.. ఐపీఎల్ 2026 మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే రోహిత్ గాయంపై ముంబై మేనేజ్‌మెంట్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ గాయం కారణంగా మైదానం వీడాల్సి వచ్చింది. జట్టు స్కోర్ 57 పరుగుల వద్ద ఉన్నపుడు హిట్‌మ్యాన్ తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడ్డాడు. ఫిజియో వచ్చి ట్రీట్‌మెంట్ అందించాక.. ఒక బంతిని ఎదుర్కొన్నాడు. ఆపై ఇబ్బందిగా ఉండడంతో హిట్‌మ్యాన్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. ఆపై తిరిగి బ్యాటింగ్‌కు రాలేదు. గాయం నుంచి హిట్‌మ్యాన్ పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. సోమవారం ఉదయం రోహిత్ ఫిజియో నితిన్ పటేల్ పర్యవేక్షణలో స్కాన్లు చేయించుకున్నాడు.

Also Read: Vaibhav Sooryavanshi Wicket: పక్కాగా ప్లాన్ చేసి.. వైభవ్‌ సూర్యవంశీని బుట్టలో వేసిన ఆ ఇద్దరు!

ఈ స్కాన్ల ద్వారా రోహిత్ శర్మ గాయం తీవ్రత ఎంత ఉందో ముంబై ఇండియన్స్ వైద్యులు అంచనా వేయనున్నారు. గాయం తీవ్రంగా ఉంటే రోహిత్ కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ముంబై తమ తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 16న పంజాబ్ కింగ్స్‌తో ముంబైలో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ప్రస్తుతం అనిశ్చితంగా మారింది. స్కాన్ రిపోర్టుల ఆధారంగా అతని ఫిట్‌నెస్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. దాదాపుగా కింగ్స్‌పై హిట్‌మ్యాన్ ఆడే అవకాశాలు లేవు. గ్రేడ్‌-1 గాయంగా తేలితే మాత్రం.. 2-3 వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. ఆ లోగా ఐపీఎల్ చివరి అంకానికి చేరుకుంది. హిట్‌మ్యాన్ గాయంపై ముంబై మేనేజ్‌మెంట్‌ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది. రోహిత్ త్వరగా కోలుకుని జట్టులో చేరాలని అభిమానులు ఆశిస్తున్నారు.