Reading Time: < 1 minute
Varanasi Movie Leak Ss Rajamouli Worried Over Mahesh Babus Action Scene Visuals

దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఏదో ఒక రూపంలో లీకులు జక్కన్నకు పెద్ద తలనొప్పిగా మారాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.

Also Read : Kollywood : కోలీవుడ్‌లో ఖాళీగా ఉన్న టాప్ చెయిర్.. రజనీ, విజయ్, అజిత్ తర్వాత ఆ వారసుడు ఎవరు?

గతంలోనే మహేష్ బాబు మరియు మలయాళ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్ మధ్య సాగే ఒక కీలక సన్నివేశానికి సంబంధించిన క్లిప్ బయటకు వచ్చి హల్చల్ చేసింది. ఇప్పుడు ఏకంగా ఒక భారీ యాక్షన్ విజువల్ నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో చిత్ర యూనిట్ షాక్‌కు గురైంది. రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సెట్స్‌లో ఎవరో ఒకరు సీక్రెట్‌గా తీస్తున్న ఈ వీడియోలు సినిమా హైప్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రాజమౌళికి ఈ లీకుల సమస్య కొత్తేమీ కాదు. గతంలో ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’  వంటి భారీ చిత్రాల షూటింగ్ సమయంలో కూడా కొన్ని కీలక సన్నివేశాలు మరియు యుద్ధానికి సంబంధించిన క్లిప్పింగ్స్ లీక్ అయ్యాయి. జక్కన్న తన సినిమాలను చాలా రహస్యంగా సర్ప్రైజ్‌లతో ప్లాన్ చేస్తారు. కానీ ఇలాంటి లీకులు జక్కన్న శ్రమను వృథా చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అవాంతరాలు ఎలా ఉన్నా సినిమా అవుట్‌పుట్ విషయంలో రాజమౌళి రాజీ పడటం లేదు. గ్లోబల్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ఇప్పటికే డేట్ ఖరారు చేశారు.