
ఎల్బీనగర్, వెలుగు: వనస్థలిపురంలోని హయగ్రీవ హాస్పిటల్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు శనివారం డికాయ్ఆపరేషన్చేపట్టారు. ఇందులో భాగంగా ఓ మహిళా పోలీసును పేషెంట్‌గా హాస్పిటల్‌కు పంపారు. ఆస్పత్రి డైరెక్టర్ కొర్ర రాజు, రిసెప్షనిస్టు లోకేశ్‌ను లింగ నిర్ధారణ చేయాలని అడిగారు.
వారు తమకు తెలిసిన తుక్కుగూడలోని శ్రీ సాయి ధనుష్ క్లినిక్ లో ల్యాబ్ టెక్నీషియన్‌గా చేస్తున్న విజయ్ కుమార్ వద్దకు వెళ్లాలని సూచించారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విజయ్ కుమార్ ను, అతనికి సహకరిస్తున్న రాజు,లోకేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.