Reading Time: 2 minutes

64 ఏళ్ల వ్యక్తికి ఉద్యోగం..స్టార్టప్ కంపెనీ సీఈవో నిర్ణయంపై నెట్టింట పెద్ద చర్చ

Caption of Image.

సాధారణంగా స్టార్టప్ కంపెనీ స్థాపించిన వారు  ఎంప్లాయీస్ గా టాలెంట్ ఉన్న డైనమిక్ యూత్ ను రిక్రూట్ చేసుకుంటారు. జీతం ఎక్కువైన పర్వాలేదు టాలెంట్ ముఖ్యం..చురుగ్గా పనిచేయాలని కోరుకుంటారు. అలాంటి వారినే టీం లీడ్ గా ప్రోత్సహిస్తారు.  అయితే ఇటీవల స్టార్టప్ కంపెనీ స్థాపించిన ఓ సీఈవో ఇందుకు భిన్నంగా 64 ఏళ్ల రిటైర్ మెంట్ వయసున్న వ్యక్తికి ఉద్యోగం ఇచ్చాడు. ఆఫీసులో అతను పనిచేస్తున్న  ఫొటోలు షేర్ చేశాడు. ఈ ఫొటోలపై ఇప్పుడు సోషల్ మీడియా పెద్ద  చర్చ సాగుతోంది. సీఈవో నిర్ణయాన్ని నెటిజన్లు  ప్రశంసిస్తున్నారు .ఆ చర్చ ఎందుకు.. సీఈవోను నెటిజన్లు ఎందుకు మెచ్చుకుంటున్నారో వివరాల్లోకి వెళితే.. 

ముంబైకి చెందిన ఓ సీఈవో తన స్టార్టప్‌లో చేరిన 64 ఏళ్ల ఇంటర్న్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేయడంతో అది వైరల్ అయ్యింది.  ఈ వీడియోతో వయస్సు, అనుభవం, ఆఫీసు విలువ వంటి అంశాలపై విస్తృత చర్చ మొదలైంది.విజయం సాధించాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదు.. అనుభవంతో కూడిన సిబ్బంది అవసరం అని ఓ స్టార్టప్ కంపెనీ  సీఈవో తీసుకున్న నిర్ణయంపై  ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చ జరగుతోంది.
జోషువా సాలిన్స్ అనే ఓ కంపెనీ సీఈవో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో సీనియర్ ఇంటర్న్ ఆఫీసులోని జూనియర్ ఉద్యోగులతో మాట్లాడుతున్నట్లు టీమ్ సభ్యులు శ్రద్ధగా వింటున్నట్లు కనిపిస్తోంది.  

►ALSO READ | ఎవరైనా సరే.. రూల్స్ బ్రేక్ చేస్తే సహించం: ఇండియాకు అమెరికా కౌంటర్..!

ఈ వీడియో తో పాటు టెక్ట్స్ కూడా  షేర్ చేశారు.. అందులో ‘‘మా స్టార్టప్‌లో 64 ఏళ్ల ఇంటర్న్ ఒకరు ఉన్నారు.. కంపెనీని  నిర్మించడం ,విస్తరించడంలో ఆయనకు అమూల్యమైన పరిజ్ఞానం ఉంది. తన అనుభవంతో సంస్థ కల్చర్ ను తీర్చిదిద్దడంలో సహాయం చేస్తున్నారు. టీమ్ నిరుత్సాహంగా ఉన్నప్పుడు  ఉచితంగా మోటివేట్ చేస్తున్నారు. ’’ అని రాశారు. దీంతోపాటు  మా ఆఫీసులో ఇప్పుడే 64 ఏళ్ల ఇంటర్న్ చేరారు. మేం తీసుకున్న నిర్ణయాల్లో ఇదే అత్యుత్తమమైనది అని కూడా రాశారు. 

ఇక ఈ అసాధారణమైన రిక్రూట్ మెంట్ కు సంబంధించిన పోస్ట్ ఆన్ లైన్  లో నెటిజన్ల ఆసక్తిని చూరగొంది. యంగ్  ఎంప్లాయీస్ కు దిశానిర్దేశం చేస్తూనే ఒక అనుభవజ్ణుడైన పెద్దాయనకు అవకాశం కల్పించాలని సీఈవో ఆలోచనను ప్రశంసించారు చాలామంది నెటిజన్లు. 
ఆ వీడియో అన్ లైన్ లో షేర్ చేసినప్పటినుంచి ఒకటే చర్చ.. వివిధ రకాల జనరేషన్స్ కలిసి పనిచేసే ఆఫీసు గురించి, అనుభవజ్ణులైన నిపుణులు స్టార్టప్ కంపెనీలకు అందించే విలువగురించి విస్తృతంగా చర్చకు దారి తీసింది. 

©️ VIL Media Pvt Ltd.