ఎండుచేపల ఆమ్లెట్ కు కావాల్సిన పదార్ధాలు : 150 గ్రాముల ఎండు చేపలు , 4 కోడిగుడ్లు, రెండు చిన్న ఉల్లిపాయలు , ఇంకా నాలుగు పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ పసుపు, నాలుగు కొత్తిమీర ఆకులు , అర టేబుల్ స్పూన్ స్పూన్ మసాలా పొడి, ఇంకా రుచికి సరిపడా ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.
ఎండుచేపల ఆమ్లెట్ తయారి విధానం : ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించి కళాయి పెట్టి దానిలో ఆయిల్ వేసి కట్ చేసిన ఎండు చేపలను వేడి నీటితో ఒకసారి, ఇంకా పసుపుతో ఒకసారి బాగా కడగాలి. ఇలా కడిగిన వాటిని బాగా ఉడికించి ఒక గిన్నె లేదా ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా వీటి వానస కూడా పోతోంది.
ఎండుచేపల ఆమ్లెట్ తయారి విధానం స్టెప్ – 1 : ఇక ఇప్పుడ ఒక గిన్నె తీసుకుని దానిలో ఎగ్స్ బ్రేక్ చేసి దానిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి ముక్కలు , ఇంకా తరిగిన కొత్తిమీర, అలాగే ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి అలాగే వీటితో పాటు కొంచం ఉప్పు వేసి బాగా మిక్స్ అయ్యేలా దీనిని కలుపుకోవాలి.
ఎండుచేపల ఆమ్లెట్ తయారి విధానం స్టెప్ – 1: ఇప్పుడు పెనం మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది బాగా వేడయ్యాక ఈ ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా పోయాలి. ఇక ఇప్పుడు దీని మీద ముందుగా ఉడికించిన ఎండుచేపలను వేసుకుని 5 నిముషాల వరకు స్టవ్ మీదే వేయించాలి. ఇలా వేయిస్తే దీనికి మంచి టేస్ట్ వస్తుంది.
ఇప్పుడు మీడియం మంట మీద 5 నిముషాలు ఉంచి పెట్టి ఒక వైపు ఎర్రగా కాలిన తర్వాత ఇంకో వైపు కూడా గోల్డ్ కలర్ లోకి మారిన తర్వాత దానిని తిప్పి ఆమ్లెట్ ను చక్కగా వేయించుకోవాలి. ఎండుచేపలు వేగే వరకు స్టవ్ మీదే అలాగే వేయించాలి. అంతే, వేడి వేడి ఎండుచేపల ఆమ్లెట్ రెడీ. ఊర్లలో ఈ రెసిపీని బాగా తింటారు. పట్టణాల్లో కూడా కొత్తవి తినడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారికీ ఇది బెస్ట్ మీ ఇంట్లోనే చేసేయండి.




