Reading Time: < 1 minute

జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్

Caption of Image.

జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల పీఎస్​పరిధిలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులను శనివారం ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ మల్లేశ్​కథనం ప్రకారం.. గాజులరామారం, హెచ్​ఏఎల్​ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో ఏడుగురు బంగ్లాదేశీయులు పాస్​పోర్టు, వీసాలు లేకుండా 2 నెలలుగా నివాసముంటున్నట్లు సమాచారం తెలిసిందన్నారు. 

దాడులు నిర్వహించి వారిని అరెస్ట్​ చేసి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. దేశంలోకి వారు అక్రమంగా ప్రవేశించినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఏడుగురిని జోగిపేటలోని డిపోర్టేషన్​సెంటర్​కి తరలించినట్లుచెప్పారు. విచారణ అనంతరం వారిని  బంగ్లాదేశ్​కి పంపనున్నట్లు  సీఐ తెలిపారు.  

©️ VIL Media Pvt Ltd.