Reading Time: < 1 minute
Prabhas Fauji Movie Teaser Loading Release Date Also Locked

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వినబడుతోంది.  ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీఅప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు త్వరలోనే ఒక భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి జస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే ఇచ్చారు. ప్రభాస్ లుక్‌ను కూడా ఫుల్ గా రివీల్ చేయకుండా కేవలం ఒక ప్రీ-లుక్ మాత్రమే బయటకు వదిలారు. దీంతో అసలైన ‘ఫౌజీ’గా రెబల్ స్టార్ ఎలా ఉంటాడనే ఎగ్జైట్మెంట్ అందరిలోనూ నెలకొంది.

వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుందని సమచారం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయడానికి చిత్రబృందం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ సర్కిల్స్ ప్రకారం ‘ఫౌజీ’  టీజర్ ను ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ చేసే ఆలోచన ఉన్నట్టు టాక్. టీజర్ విడుదలతో పాటే సినిమా ప్రమోషన్స్ వేగాన్ని కూడా పెంచాలని చిత్రబృందం భావిస్తోందట. బ్యాక్ టు బ్యాక్ పాటలు, అలాగే చిత్రంలోని కీలక పాత్రలను పరిచయం చేసే గ్లిమ్స్ వీడియోలను వరుసగా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరి మైత్రీ మూవీ మేకర్స్ ఈ అఫీషియల్ అప్‌డేట్స్‌ను ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. మరోవైపు ఈ సినిమాను  2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.