Reading Time: < 1 minute

విమెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌ కప్‌: ఆల్‌‌రౌండ్‌‌ షోతో ఆకట్టుకున్న ఆసీస్

Caption of Image.

మాంచెస్టర్‌‌: ఆల్‌‌రౌండ్‌‌ షోతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా.. విమెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో శుభారంభం చేసింది. ఫోబీ లిచ్‌‌ఫీల్డ్‌‌ (50)కి తోడుగా జార్జియా వారెహామ్‌‌ (32, 3/13) నిలకడగా ఆడటంతో.. శనివారం జరిగిన గ్రూప్‌‌–1 తొలి మ్యాచ్‌‌లో ఆస్ట్రేలియా 65 రన్స్‌‌ తేడాతో సౌతాఫ్రికాపై నెగ్గింది. టాస్‌‌ నెగ్గిన ఆసీస్‌‌ 20 ఓవర్లలో 172/8 స్కోరు చేసింది. లిచ్‌‌ఫీల్డ్‌‌, ఎలైస్‌‌ పెర్రీ (36), అనాబెల్‌‌ సదర్లాండ్‌‌ (21), నికోలా కెరీ (13 నాటౌట్‌‌) మెరుగ్గా ఆడారు. 

ఛేజింగ్‌‌లో సౌతాఫ్రికా 16.4 ఓవర్లలో 107 రన్స్‌‌కే ఆలౌటైంది. లారా వోల్‌‌వర్ట్‌‌ (44), డిక్లెర్క్‌‌ (25), మారిజానె కాప్‌‌ (12) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఆసీస్‌‌ బౌలర్ల ధాటికి సఫారీ ఇన్నింగ్స్‌‌లో ఎనిమిది మంది సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితమయ్యారు. వారెహామ్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

స్కాట్లాండ్‌‌ గెలుపు

గ్రూప్‌‌–2 మ్యాచ్‌‌లో స్కాట్లాండ్‌‌ 40 రన్స్‌‌ తేడాతో ఐర్లాండ్‌‌ను ఓడించింది. ముందుగా స్కాట్లాండ్‌‌ 161/5 స్కోరు చేసింది. కేథరిన్‌‌ బ్రైస్‌‌ (60), సారా బ్రైస్‌‌ (49) రాణించారు. తర్వాత ఐర్లాండ్‌‌ 19.1 ఓవర్లలో 121 రన్స్‌‌కే ఆలౌటైంది. అమీ హంటర్‌‌ (39) టాప్‌‌ స్కోరర్‌‌. ఓర్లా ప్రెండర్‌‌గాస్ట్‌‌ (33) ఫర్వాలేదనిపించినా మిగతా వారు బ్యాట్లు ఎత్తేశారు. కేథరిన్‌‌ బ్రైస్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు దక్కింది.

©️ VIL Media Pvt Ltd.