Reading Time: < 1 minute
Suriya 50 Is A Star Director Preparing The Story

ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘కరుప్పు’ చిత్రం సాధించిన అద్భుత విజయంతో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మార్కెట్ రేంజ్ మరింత పెరిగింది. ప్రయోగాత్మక చిత్రాలతో పాటు కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ చేస్తూవస్తున్న సూర్య ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సూర్య నటిస్తున్నవిశ్వనాథ్ అండ్ సన్స్ విడుదలకు సిద్ధమవుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇన్ సైడ్ టాక్ చాలా బాగుంది. ఇక మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ జితూ మాధవన్ దర్శకత్వంలో నజ్రియా నజీమ్, నస్లేన్ కీలక పాత్రల్లో మరో సినిమా చేస్తున్నాడు సూర్య. 

జితూ మాధవన్ సినిమా కంప్లీట్ కాగానే సూర్య తన 48వ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. ‘జై భీమ్’ లాంటి సెన్సేషనల్ హిట్‌ను అందించిన దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండటం విశేషం. వీరిద్దరి కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోసారి ఒక పవర్‌ఫుల్ సోషల్ డ్రామాతో ఈ కాంబో రాబోతున్నట్లు సమాచారం.ఇక సూర్య కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 50వ చిత్రం గురించి కోలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. ఈ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్ కోసం జైలర్ ఫేమ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో చర్చలు జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రస్తుతం నెల్సన్, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘జైలర్ 2’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ కారణంగానే సూర్య ప్రాజెక్ట్‌పై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కాంబో గనుక సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.