
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. డైరెక్టర్ బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టుతోంది. వీక్ డేస్ లో కొద్దిగా కలెక్షన్లు తగ్గినా వీకెండ్ లో మాత్రం రామ్ చరణ్ సినిమా దుమ్మురేపుతోంది. ఈ నేపథ్యంలో శనివారం (జూన్ 13) కూడా పెద్ది సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. మొత్తం మీద ఈ మెగా మూవీకి ఇప్పటివరకు (10 రోజుల్లో) రూ. 378 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ లెక్కన రామ్ చరణ్ సినిమాకు శనివారం రూ. 12 కోట్ల కలెక్షన్లు వచ్చాయిజ. ఈ మేరకు వసూళ్ల వివరాలను వెల్లడిస్తూ చిత్ర బృందం అధికారికంగా పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఇక ఓవర్సీస్ లోనూ నార్త్ లోనూ పెద్ది సినిమాకు రికార్డు కలెక్షన్లు వచ్చాయి. ఆదివారం (జూన్ 14) సెలవు దినం కాబట్టి పెద్ది సినిమా కలెక్షన్లు మరింత పెరగవచ్చని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వృది సినిమాస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పెద్ది చిత్రాన్ని నిర్మించారు. . క్రికెటర్ గా, రెజ్లర్ గా, రన్నర్‌గా రామ్ చరణ్ అద్భుత నటనకు విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. అలాగే జగపతి బాబు అప్పల సూరి పాత్రకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక శివరాజ్ కుమార్, దివ్యేందు త్రిపాఠి, రావు రమేష్, బొమన్ ఇరానీ, రవి కిషన్, కమెడియన్ సత్య, చమ్మక్ చంద్ర, అజయ్ ఘోష్ తదితరులు పెద్ది సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
పెద్ది సినిమా 10 రోజుల కలెక్షన్లు..
#PEDDI GROSSES 378 CRORES+ WORLDWIDE in 10 days
Racing ahead at the box office in style
https://t.co/EMhY3eMGKq pic.twitter.com/R7q18Z3TIR
— PEDDI (@PeddiMovieOffl) June 14, 2026
బుక్ మై షోలో పెద్ది రికార్డు
#Peddi is SOUTH INDIA’S BIGGEST GROSSER OF 2026
Running successfully with 6 MILLION+ TICKETS SOLD on Book My Show and District alone
https://t.co/EMhY3eMGKq pic.twitter.com/DxQ67pr4Vk
— PEDDI (@PeddiMovieOffl) June 13, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

