
దిన ఫలాలు (జూన్ 14, 2026): మేష రాశి వారు ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృషభ రాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొన్ని అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సోదరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వివాదం రాజీ మార్గంలో పరిష్కారమవుతుంది. ప్రముఖుల నుంచి గౌరవమర్యాదలు లభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ చాలావరకు సఫలం అవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. పదోన్నతితో కూడిన స్థాన చలనానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం అనుకూలంగా సాగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో బంధువులను తలదూర్చనివ్వవద్దు. ఆదాయం నిలకడగా ఉండవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొన్ని అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి చికాకులుంటాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. సమాజంలోని అతి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ఆదాయ మార్గాలు చేతికి అందుతాయి. ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆదాయానికి లోటుండదు కానీ, వృథా ఖర్చులకు కళ్లెం వేయాల్సి ఉంటుంది. కొద్దిగా ఇబ్బందులున్నా ఆస్తి వ్యవహారాల్ని సానుకూలంగా పూర్తి చేస్తారు. కొన్ని ముఖ్యమైన పనుల మీద దృష్టి పెడతారు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అసంతృప్తి తలెత్తే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. పనిభారం, ఒత్తిడి బాగా తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా అనుకూలంగా మారుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహాల వల్ల ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యానికి లోటుండదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. కొన్ని ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ వార్తలు వింటారు. మిత్రులకు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారాలు హుషారుగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వేగంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ఊహించని కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. కొత్త ఆలోచనలకు, కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో ప్రాధాన్యానికి, ప్రాభవానికి లోటుండదు. అధికారులు కొత్త బాధ్యతల్ని అప్పజెప్పే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో సరైన గుర్తింపు లభించడంతో పాటు డిమాండ్ పెరుగుతుంది. వ్యాపా రాలు బాగానే కలిసి వస్తాయి. ఇంటా బయటా మీ మాటకు బాగా విలువ పెరుగుతుంది. బంధు మిత్రుల ఆదరణ లభిస్తుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సానుకూల ఫలితాలనిస్తాయి. వ్యక్తిగత జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతాయి. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఊహించని ప్రోత్సాహకాలు, ప్రతిఫలాలు అందుతాయి. ఆదాయానికి లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఎటువంటి వ్యాపారా లైనా చాలావరకు లాభాల బాటలో సాగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి, మనశ్శాంతి పొందుతారు. ఆర్థికంగా మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఆశించిన కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి. ఆరోగ్యం బాగా నిలకడగా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో అదనపు బాద్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. అధికారులకు మీ పనితీరు బాగా నచ్చుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఊహించని అదృష్టాలు పడతాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు అనుకోకుండా పరిష్కారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.