Reading Time: < 1 minute

వర్షాల ఎఫెక్ట్.. ఉద్యోగులకు సెలవుల్లేవ్..అందరూ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఉండాల్సిందే: మంత్రి కోమటి రెడ్డి

Caption of Image.
  • భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్రమత్తం చేశారు. శనివారం హైదరాబాద్ నుంచి ఆ శాఖ ముఖ్య అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వర్షాల తీవ్రత దృష్ట్యా ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీ ఇంజినీర్లు, అధికారుల సెలవులను తక్షణమే రద్దు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. అధికారులందరూ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎర్రమంజిల్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని డివిజన్ల పరిధిలోని వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టుల వద్ద అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఇరిగేషన్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎక్కడైనా రోడ్లు కోతకు గురైతే, తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్నారు. 

©️ VIL Media Pvt Ltd.