
Rohit Sharma Record: ధర్మశాలలోని హెచ్‌పీసీఏ (HPCA) స్టేడియం సాక్షిగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరో సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో హిట్‌మ్యాన్ వన్ అండ్ ఓన్లీ ‘మాస్’ రికార్డుతో నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 16,000 పరుగులు పూర్తి చేసుకున్న ప్రపంచంలోనే 7వ బ్యాటర్‌గా, అలాగే వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత రెండో భారత క్రికెటర్‌గా రోహిత్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు.
గాయంతో విలవిలలాడిన రోహిత్:
ధర్మశాల చలి వాతావరణంలో ఈ మ్యాచ్ రోహిత్‌కు అంత ఈజీగా ఏమీ సాగలేదు.. ఆఫ్ఘన్ స్పీడ్‌స్టర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన మొదటి ఓవర్ 3వ బంతికే ఒక ప్రమాదకరమైన బాడీ-లైన్ బౌన్సర్ రోహిత్ రైట్ హ్యాండ్ గ్లోవ్స్‌కు బలంగా తాకింది. దాంతో అతడు తీవ్రమైన నొప్పితో విలవిలలాడిపోయాడు. వెంటనే ఫిజియోలు మైదానంలోకి వచ్చి చాలాసేపు ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సి వచ్చింది.
►ALSO READ | ఆఫ్ఘన్ ఆలౌట్.. భారత జట్టు టార్గెట్ ఎంతంటే!
సిక్సర్‌తో రికార్డు బద్దల్:
చేతికి గాయం అయినప్పటికీ, ఫుల్ కాన్ఫిడెన్స్‌తో రోహిత్ బ్యాటింగ్ కొనసాగించాడు. జియార్ రెహ్మాన్ ఓవర్‌లో ఒక క్లాసిక్ బ్యాక్‌ఫుట్ పంచ్‌తో బౌండరీ బాదిన రోహిత్.. ఆ తర్వాత ఒమర్జాయ్ వేసిన 3వ ఓవర్‌లో అసలైన ఆట చూపించాడు. ఒమర్జాయ్ వేసిన షార్ట్ పిచ్ బౌన్సర్‌ను తన ట్రేడ్‌మార్క్ స్టైల్‌లో డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా ఆకాశమే హద్దుగా ఒక పవర్‌ఫుల్ సిక్సర్ కొట్టడంతో.. 16 వేల పరుగుల మైలురాయిని టచ్ చేశాడు. దాంతో స్టేడియం మొత్తం రోహిత్.. రోహిత్.. అంటూ మారుమోగిపోయింది.
రోహిత్ రికార్డులు:
రోహిత్ శర్మ ఓపెనర్‌గా ఇప్పటివరకు 359 మ్యాచుల్లో 45.35 అదిరిపోయే యావరేజ్‌తో 16,009* రన్స్ చేశాడు. ఇందులో 45 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓపెనర్‌గా ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ వీరేంద్ర సెహ్వాగ్ (16,119) పేరిట ఉండగా.. రోహిత్ ఆ రికార్డుకు కేవలం 110 పరుగుల దూరంలోనే ఉన్నాడు.
Scaling Mt. 16,000 🗻
A monumental milestone unlocked by Rohit Sharma as an opener in international cricket 👏🫡
Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/vyC4C0oPvg
— BCCI (@BCCI) June 13, 2026