Reading Time: < 1 minute

సొంతూరిలో విజయ్-రష్మిక దంపతులు.. విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్ పంపిణీ

Caption of Image.

హీరో విజయ్ దేవరకొండ మాట నిలబెట్టుకున్నారు. చెప్పినట్లుగానే విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్ పంపిణీ చేశారు. 2026 జూన్ 24 (ఆదివారం)  సతీమణి రష్మితో పాటు కుటుంబ సభ్యులతో  కలిసి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గంలోని తుమ్మన్ పేటకు వెళ్లిన విజయ్.. విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్ చెక్కులను అందజేశారు. 

ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9వ, 10వ తరగతి విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతి క్లాస్ నుంచి ఫస్ట్, సెకండ్ ర్యాంకర్లకు స్కాలర్ షిప్స్ అందజేశారు. మొత్తం 180 మంది విద్యార్థులతో కూడిన మెరిట్ లిస్ట్ విడుదల చేసిన విజయ్-రష్మిక దంపతులు.. అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సమక్షంలో విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందజేశారు. 

అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్స్ ఇవ్వనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించారు విజయ్. అందుకు సంబంధించిన ప్రతిపాదన గురించి అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణకు తెలియజేశారు. విజయ్ ఆలోచనను అభినందించిన ఎమ్మెల్యే.. ప్రభుత్వం తరఫున కావాల్సిన ఏర్పాట్లను చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ ఎమ్మెల్యేతో పాటు పలువురు అతిథుల మధ్య విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ, విజయ్ తల్లిదండ్రులు, సన్నిహితులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. 

అంతకు ముందు హైదరాబాద్ నుంచి భార్య విజయ్ తో కలిసి స్వగ్రామానికి బయల్దేరిన విజయ్.. స్కాలర్ షిప్స్ పంపిణీకి స్వగ్రామానికి వెళ్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. 180 మంది విద్యార్థులతో కూడిన మెరిట్ లిస్టును విడుదల చేశారు. 

 

©️ VIL Media Pvt Ltd.