Reading Time: < 1 minute
ఏం పాట మావ..! యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పులేయాల్సిందే

ఫోక్ సాంగ్స్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ మధ్యకాలంలో ఫోక్ సాంగ్స్ తెగ విడుదల అవుతున్నాయి. సినిమా సాంగ్స్ ను మించి జానపద గీతాలు క్రేజ్ తెచ్చుకోవడంతో చాలా మంది అలాంటి సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే నెలకు రెండు మూడు సాంగ్స్ యూట్యూబ్ లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ ఫోక్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. రీసెంట్ గానే ఈ సాంగ్ విడుదలైంది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ సాంగ్ సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సాంగ్ అటు సోషల్ మీడియాలోనూ ఇటు యూట్యూబ్ లోనూ తెగ వైరల్ అవుతుంది. ఇంతకూ ఆ సాంగ్ ఎదో తెలుసా.?

ఇది కూడా చదవండి : Jabardasth Vinod: జబర్దస్త్ లేకపోతే ఆ పని చేసేవాడిని.. అసలు విషయం చెప్పిన లేడీ గెటప్ వినోద్

ప్రస్తుతం యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఆ సాంగ్ మరేదో కాదు లగారే సౌండ్ సాలా.. ఫోక్ డాన్సర్ నగదుర్గ నటించిన ఈ సాంగ్ ఇటీవలే విడుదలైంది. విడుదలైన కొన్ని గంటల్లోన్నే వేల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటుంది ఈ సాంగ్.. ఈ సాంగ్ కోసం చాలా మంది ఆడియన్స్ ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ సాంగ్ విడుదలైంది. ఇప్పుడు దుమ్మురేపుతోంది ఈ సాంగ్.

ఇది కూడా చదవండి : ఇప్పుడున్న హీరోల్లో అతనొక్కడే నన్ను ఆంటీ అని పిలుస్తాడు.. జయసుధ ఆసక్తికర కామెంట్స్

బుల్లెట్ బండి లక్ష్మణ్ ఈ సాంగ్ రచించారు. అలాగే ఈ సాంగ్ ను మమతా రమేష్ ఆలపించారు. మదిన్ ఈ సాంగ్ కి సంగీతం అందించారు. ఇక నాగ దుర్గ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన డాన్స్ తో అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ కుర్రది. అలాగే ఈ సాంగ్ లోనూ దుమ్మురేపింది నాగ దుర్గ.. ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది ఈ సాంగ్. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి : అప్పుడు నా సినిమాలో నటించాడు.. ఇప్పుడు స్టార్ హీరో.. అతను ఎంత మారిపోయాడంటే

ఫోక్ సాంగ్ ఇక్కడ చూడండి..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి