Reading Time: < 1 minute

గోదావరిఖనిలో ఫుడ్ పాయిజన్…11 మంది మెడికోలకు అస్వస్థత

Caption of Image.

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి మెడికల్​ కాలేజీలో సెకండ్​ ఇయర్​ చదువుతున్న 11 మంది ఎంబీబీఎస్​ స్టూటెంట్లు ఫుడ్​ పాయిజన్​కు గురయ్యారు. శుక్రవారం సెమిస్టర్​ ఎగ్జామ్స్​ ముగియడంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన మెడికోలు స్థానిక పద్మావతి కాలనీ సమీపంలోని ఓ రెస్టారెంట్​ నుంచి పార్శిల్​ తెప్పించుకొని తిన్నారు.

 శనివారం తెల్లవారుజామున వారికి వాంతులు, విరేచనాలు అయి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే మెడికోలను గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించడానికి కాలేజీ మేనేజ్​మెంట్​ నిరాకరించింది.
 

©️ VIL Media Pvt Ltd.