
కొత్తపల్లి, వెలుగు : ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ, జూనియర్ కాలేజీ అద్భుత ఫలితాలతో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. చైర్మన్ కొత్త సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో 2017 లో స్థాపించిన ఈ కళాశాల యాజమాన్యం, అధ్యాపకుల విశేష కృషితో 2000 మంది విద్యార్థులు ఆర్మీ నేవి ఉద్యోగాలు సాధించి రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది.
ఇటీవల వెలువడిన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగ ఫలితాలలో 193 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించి తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచారు. ఇటీవలి ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఎంపీసీ గ్రూప్లో 468/470 మార్కులు, సెకండ్ ఇయర్ ఫలితాల్లో 992/1000 మార్కులు సాధించి తెలంగాణలో కాలేజీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.