Reading Time: < 1 minute

వరంగల్ భద్రకాళి ఆలయం దగ్గర హై టెన్షన్… ఆలయ శుద్ధి పేరుతో బీజేపీ ఆందోళన..

Caption of Image.

వరంగల్ లో కుడా భూముల వ్యహారంలో సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయం వేడెక్కిన సంగతి తెలిసిందే. శనివారం ( జులై 4 ) కూడా భద్రకాళి ఆలయం దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. కుడా భూములపై నిన్న తడి బట్టలతో ప్రమాణాలు చేసిన క్రమంలో బిజెపి నిరసన చేపట్టింది. ఆలయాన్ని అపవిత్రం చేసారంటూ శుద్ధి పేరుతో ఆందోళన చేపట్టింది బీజేపీ.

ఈ క్రమంలో భద్రకాళి ఆలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆలయం లోపలికి వెళ్లేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించగా.. అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఆలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు.

©️ VIL Media Pvt Ltd.