Reading Time: < 1 minute

వీకెండ్ తగ్గిన గోల్డ్ రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో శనివారం ధరలివే..

Caption of Image.

గడచిన రెండు రోజులుగా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా చల్లబడ్డాయి. అంతర్జాతీయంగా విశ్లేషకుల అంచనాలు, వడ్డీ రేట్ల పెంపుపై అనిశ్చితితో నిన్నటి వరకూ పసిడి పరుగులు జరిగినప్పటికీ మళ్లీ క్రమంగా తగ్గటం కొనుగోలుదారులకు ఊరటను కలిగిస్తోంది. వారాంతంలో షాపింగ్ చేద్దాం అనుకుంటున్న వాళ్లు ముందుగా తమ నగరంలో ధరలను పరిశీలించటం ముఖ్యం. 

జూలై 4న బంగారం రేట్లు తగ్గాయి. జూలై 3 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.27 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 673గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 450గా కొనసాగుతోంది. 

శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూలై 4, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 60వేలుగా స్థిరంగానే ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.260 దగ్గర ఉంది. 

©️ VIL Media Pvt Ltd.