Reading Time: 2 minutes

పాయసంలో నిద్రమాత్రలు కలిపి భర్తను చంపిన భార్య… శవాన్ని బాత్ రూంలో పాతిపెట్టి మిస్సింగ్ డ్రామా…

Caption of Image.

బాబోయ్… ఈ ఆడాళ్ళు మరీ ఇంత వైలెంట్ గా మారిపోతున్నారేంటండి బాబు..! ఒకామె ఏమో హనీమూన్ కి తీసుకెళ్లి లోయలో తోసి భర్తను చంపేస్తుంది… మరొకామె పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ లో ప్రియుడితో కలిసి కాబోయే భర్తను చంపేస్తుంది. మగజాతి మీద వీళ్ళేమైనా పగబట్టారా అన్న సందేహం వస్తోంది ఇలాంటి వరుస ఘటనలు చూస్తుంటే. ఇప్పుడు యూపీలో మరో ఘోరం జరిగింది. భార్య చేతిలో మరో భర్త బలయ్యాడు.. బాత్ రూమ్ ఫ్లోర్ కింద శవమై తేలాడు. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపింది ఓ భార్య. శవాన్ని బాత్ రూమ్ లో పాతి పెట్టడమే కాకుండా 45 రోజులు మిస్సింగ్ డ్రామా ఆడింది సదరు భార్యామణి. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి….

ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగింది ఈ దారుణ ఘటన. ఆగ్రాకు చెందిన రూబీ, భర్త సురేంద్రను పాయసంలో నిద్ర మాత్రలు కలిపి చంపేసింది. ఈ తర్వాత భర్త శవాన్ని బాత్ రూంలోనే పాతిపెట్టి.. తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు పోలీసులు. ధర్మేంద్ర కోసం గాలిస్తుండగా… రూబీ ఓవరాక్షన్ చూసి ధర్మేంద్ర సోదరుడికి అనుమానం వచ్చింది. రుబీ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందంటూ పోలీసులకు తెలిపాడు ధర్మేంద్ర సోదరుడు.

పోలీసుల విచారణలో కూడా రూబీ పొంతన లేని విషయాలు చెప్పడంతో… రుబీపై అనుమానంతో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.   పోలీసులు రూబీ ఇంట్లో తనిఖీ చేయగా.. బాత్ రూం కింద ధర్మేంద్ర శవం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యలో రూబీతో పాటు మరికొంతమంది ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

©️ VIL Media Pvt Ltd.