
సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో అలరిస్తుంది. ఓవైపు రాజకీయాల్లో ఆమె పేరు మారుమోగుతుండగా.. ఇటు సోషల్ మీడియాలో నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లకు దగ్గరవుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా త్రిష తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు తెగ వైరలవుతుంది. ఆమె ఆన్ లైన్ షాపింగ్ చేసి తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. ఏకంగా ఇంటర్నేషనల్ బ్రాండ్ జారా పై ఆగ్రహం వ్యక్తం చేసింది త్రిష. ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ జారాలో ఆన్ లైన్ షాపింగ్ చేసిన త్రిష.. ఆ సంస్థ డెలివరీ తీరుపై మండిపడింది. వరుసగా మూడుసార్లు తనకు వచ్చిన బట్టలు దుర్వాసన వచ్చాయని.. అలాంటి బట్టలు డెలివరీ చేశారంటూ విరుచుకుపడింది త్రిష. హోమ్ డెలివరీ చేసేటప్పుడు.. లేదా కనీసం ప్యాక్ చేసే ముందైనా దుస్తులు ఎలాంటి వాసన వస్తున్నాయని చూడాలని అన్నారు. ఇప్పుడు ఆమె చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..
“డియర్ జారా.. ఒక చిన్న విజ్ఞప్తి.. మేము మరోసారి హోమ్ డెలివరీ కోసం ఆర్డర్ చేసినప్పుడు.. దుస్తుల నుంచి ఎలాంటి దుర్వాసన రాకుండా చూసుకోండి.. ఇప్పటికే మూడు సార్లు ఆర్డర్ చేస్తే దుర్వాసన వస్తున్న బట్టలు పంపించారు. కనీసం ప్యాక్ చేసే ముందైన ఆ బట్టల నుంచి ఎలాంటి వాసన వస్తుందనేది చూడండి” అంటూ రాసుకొచ్చింది త్రిష. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ తెగ వైరలవుతుంది. ఇంటర్నేషనల్ బ్రాండ్ నుంచి ఇలాంటి క్వాలిటీ లేని సర్వీస్ రావడంపై త్రిష అగ్రహం వ్యక్తం చేసింది.
ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..
త్రిష సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే సూర్య జోడిగా కరుప్పు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే మరోవైపు త్రిష చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. అలాగే తమిళం, తెలుగు, మలయాళం భాషలలో మరిన్ని ఆఫర్స్ అందుకుంటుంది. ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న త్రిష.. నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ పంచుకుంటుంది.
ఎక్కువ మంది చదివినవి : Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..
త్రిష పోస్ట్..
Trisha Insta Post
ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..