Reading Time: 3 minutes
Ipl 2026 Phase 2 Full Schedule List Of Fixtures Know Details Here

ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి రెండో దశ (Phase 2) షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా విడుదల చేసింది. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు దేశవ్యాప్తంగా 12 నగరాల్లో మొత్తం 50 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ విడతలో భాగంగా ఎనిమిది రోజుల పాటు ఒక్కో రోజు రెండు మ్యాచ్‌లు (డబుల్ హెడర్స్) నిర్వహిస్తారు. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.

ఈ షెడ్యూల్ ఏప్రిల్ 13న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే పోరుతో మొదలవుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 14న చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఏప్రిల్ 15న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఏప్రిల్ 16న ముంబైలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌తో పోటీ పడుతుంది. ఏప్రిల్ 17న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడతాయి.

Also Read:Gold Robbery: బంగారం కోసం చెవులను కోసేసి.. ఆపై దారుణం..

ఏప్రిల్ 18వ తేదీన రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. మధ్యాహ్నం బెంగళూరులో ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య, రాత్రి హైదరాబాద్‌లో సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోటీ జరుగుతుంది. ఏప్రిల్ 19న కూడా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. మధ్యాహ్నం కోల్‌కతాలో కేకేఆర్ , రాజస్థాన్ రాయల్స్ మధ్య.. రాత్రి చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌లు ఉంటాయి.

22

ఏప్రిల్ 20న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ మరియు ముంబై ఇండియన్స్ తలపడతాయి. ఏప్రిల్ 21న హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు జరుగుతుంది. ఏప్రిల్ 22న లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ పోటీ పడతాయి. ఏప్రిల్ 23న ముంబైలో ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఏప్రిల్ 24న బెంగళూరులో ఆర్సీబీ , గుజరాత్ టైటాన్స్ తలపడతాయి. ఏప్రిల్ 25న మధ్యాహ్నం ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

ఏప్రిల్ 25న రాత్రి జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య పోరు జరుగుతుంది. ఏప్రిల్ 26న రెండు మ్యాచ్‌లు ఉన్నాయి… మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, రాత్రి లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడతాయి. ఏప్రిల్ 27న ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ ఉంటుంది. ఏప్రిల్ 28న చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ పోటీ పడతాయి. ఏప్రిల్ 29న ముంబైలో ముంబై ఇండియన్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడగా.. ఏప్రిల్ 30న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ మరియు ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరుగుతుంది.

Whatsapp Image 2026 03 26 At 6.33.51 Pm

మే నెలలో జరిగే మ్యాచ్‌లు..

మే 1న జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతాయి. మే 2న చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ మధ్య భారీ పోరు జరగనుంది. మే 3న రెండు మ్యాచ్‌లు ఉన్నాయి.. మధ్యాహ్నం హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ vs కేకేఆర్, రాత్రి అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ vs పంజాబ్ కింగ్స్ పోటీ పడతాయి. మే 4న ముంబైలో ముంబై ఇండియన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, మే 5న ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లు ఉన్నాయి. మే 6న హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు పంజాబ్ కింగ్స్ తలపడతాయి. మే 7న లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్ vs ఆర్సీబీ, మే 8న ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ vs కేకేఆర్, మే 9న జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ vs గుజరాత్ టైటాన్స్ పోటీ పడతాయి.

మే 10న రెండు మ్యాచ్‌లు ఉన్నాయి.. మధ్యాహ్నం చెన్నైలో సిఎస్‌కే vs లక్నో, రాత్రి రాయ్‌పూర్‌లో ఆర్సీబీ vs ముంబై ఇండియన్స్ తలపడతాయి. మే 11న ధర్మశాలలో పంజాబ్ vs ఢిల్లీ, మే 12న అహ్మదాబాద్‌లో గుజరాత్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. మే 13న రాయ్‌పూర్‌లో ఆర్సీబీ vs కేకేఆర్, మే 14న ధర్మశాలలో పంజాబ్ vs ముంబై, మే 15న లక్నోలో లక్నో vs సిఎస్‌కే మధ్య పోటీ ఉంటుంది. మే 16న కోల్‌కతాలో కేకేఆర్ vs గుజరాత్ టైటాన్స్ తలపడతాయి. మే 17న మధ్యాహ్నం ధర్మశాలలో పంజాబ్ vs ఆర్సీబీ, రాత్రి ఢిల్లీలో ఢిల్లీ vs రాజస్థాన్ మధ్య మ్యాచ్‌లు ఉన్నాయి.

మే 18న చెన్నైలో సిఎస్‌కే vs సన్‌రైజర్స్ హైదరాబాద్, మే 19న జైపూర్‌లో రాజస్థాన్ vs లక్నో, మే 20న కోల్‌కతాలో కేకేఆర్ vs ముంబై ఇండియన్స్ తలపడతాయి. మే 21న చెన్నైలో సిఎస్‌కే vs గుజరాత్, మే 22న హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు ఆర్సీబీ మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్‌లలో ఒకటి జరుగుతుంది. మే 23న లక్నోలో లక్నో vs పంజాబ్ కింగ్స్ పోటీ పడతాయి. మే 24న లీగ్ దశ ముగింపు సందర్భంగా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. మధ్యాహ్నం ముంబైలో ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్, రాత్రి కోల్‌కతాలో కేకేఆర్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరుతో లీగ్ దశ ముగుస్తుంది.