Reading Time: < 1 minute

IPL Trophy: 18 సీజన్లు గడిచిన ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకోని జట్లు ఇవే?

Caption of Image.

IPL Trophy: ప్రపంచంలోనే అత్యంత పాపులారిటీ పొందిన క్రీడా లీగ్‌లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఒకటి. ప్రతి సీజన్‌లో అన్ని జట్లు సమానంగా పోటీ పడుతుండటంతో ఎవరు విజేత అవుతారో ముందుగా చెప్పడం చాలా కష్టంగా మారిపోతుంది. 18 సీజన్లు గడిచిన ఇప్పటి వరకు టైటిల్ గెలవని జట్లు కూడా ఉన్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ) ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మెగా వేలాన్ని నిర్వహిస్తూ జట్ల మధ్య సమతౌల్యం ఉండేలా ప్రయత్నిస్తుంది. దీని వల్ల ప్రతి జట్టుకూ కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసుకునే ఛాన్స్ లభిస్తుంది. ఈ విధానం వల్ల ఎక్కువ జట్లు కనీసం ఒకసారి అయినా ఐపీఎల్ ట్రోఫీని గెలిచే అవకాశం ఉంటుంది 

2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి  నుంచి ఇప్పటి వరకు అన్ని సీజన్‌లలో పాల్గొంటున్న రెండు జట్లు ఇప్పటికీ ట్రోఫీని గెలవలేకపోయాయి. అవే పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్.. ఈ రెండు టీమ్స్ ఐపీఎల్ తొలి సీజన్ నుంచే పాల్గొంటున్నప్పటికీ ఇప్పటివరకు విజేతలుగా నిలవలేకపోయాయి. అయితే ఈ జట్లు ఫైనల్‌కు చేరిన సందర్భాలు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ జట్టు 2014, 2025 ఎడిషన్‌లలో ఫైనల్‌కు చేరినా ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయింది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 2020 సీజన్‌లో ఫైనల్‌కు చేరి కూడా విజయం సాధించలేకపోయింది. ఇక రైజింగ్ పుణే సూపర్ జెయింట్ జట్టు 2017లో ఫైనల్‌కు చేరినా టైటిల్ కొట్టలేకపోయింది.  

►ALSO READ | IPL 2026: బెంగాల్, తమిళనాడు ఎన్నికల తేదీలను ప్రకటించిన ఈసీ.. త్వరలోనే ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్! 

ఇలా ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రోఫీని అందుకోలేకపోవడం విశేషం. ప్రతి సీజన్‌లో బలమైన జట్లుతో బరిలోకి దిగుతున్న ఈ ఫ్రాంచైజీలు, రాబోయే సీజన్‌లలో అయినా తమ మొదటి ఐపీఎల్ టైటిల్‌ను సాధించాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు.  
 

©️ VIL Media Pvt Ltd.