Reading Time: < 1 minute
Lenin Box Office Collection Day 2 Akhil Akkineni Film Crosses Rs 37 Crore Worldwide

Lenin Box Office Collections: అఖిల్ అక్కినేని కెరీర్‌లోనే ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద బలమైన ఆరంభాన్ని నమోదు చేసింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ రివెంజ్ యాక్షన్ డ్రామా, విడుదలైన తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తూ వసూళ్లలో దూసుకుపోతోంది. మొదటి రోజు వచ్చిన పాజిటివ్ టాక్ తో రెండో రోజు కూడా కలెక్షన్లు మోత మోగుతోంది. ఈ ఊపుతో తొలి వారాంతంలోనే సినిమా భారీ మైలురాయిని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు. విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 37.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇందులో రెండో రోజు ఒక్కరోజే రూ.20.5 కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం. తొలి రోజు నమోదైన రూ.16.7 కోట్ల కలెక్షన్లతో పోలిస్తే రెండో రోజు గణనీయమైన వృద్ధి కనిపించడం ట్రేడ్ వర్గాలను ఆకట్టుకుంటోంది.

ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ నుంచి కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోందని తెలుస్తోంది. వీకెండ్ కావడంతో ఆదివారం థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన కేంద్రాల్లో అడ్వాన్స్ బుకింగ్‌లు జోరుగా కొనసాగుతున్నాయని సమాచారం. దీంతో 50 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి ‘లెనిన్’ చేరేందుకు ఎంతో సమయం పట్టదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ప్రముఖ నటుడు నాగార్జునతో పాటు నిర్మాత నాగ వంశీ నిర్మాతలుగా వ్యవహరించారు. సినిమాలో ప్రమోద్ పంజు, శివాజీ, బ్రహ్మాజీ, సునీల్, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. వీరి నటనకు కూడా మంచి స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకు మరో ప్లస్ పాయింట్ థమన్ అందించిన సంగీతం. యాక్షన్ సన్నివేశాల్లో థమన్ బీజీఎం సినిమాకు మరింత హైప్ చేకూర్చిందని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ‘లెనిన్’కు లభించిన ఈ భారీ ఓపెనింగ్స్ అఖిల్ కెరీర్‌ ను మలుపు తిప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తొలి వారాంతం ముగిసే సమయానికి ఈ చిత్రం ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో అని సినీ వర్గాలతో పాటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.