
పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీం ఇండియా మహిళ జట్టు టి-20 సిరీస్‌ని కైవసం చేసుకుంది.. కానీ, వన్డే సిరీస్‌ని కోల్పోయింది. ఇప్పుడు ఆతిథ్య జట్టుతో ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన హర్మన్‌ప్రీత్ సేన పెద్దగా రాణించలేకపోయింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు భారీ స్కోర్ సాధించలేకపోయారు. దీంతో 62.4 ఓవర్లలో 198 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్‌లో జెమీమా (52) అర్థ శతకంతో రాణించగా.. షెఫాలీ వర్మ 35, కశ్వీ గౌతమ్ 34 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో అన్నాబెల్ సదర్లాండ్ 4, లూసీ హామిల్టన్ 3, డార్సీ బ్రౌన్ 2, అష్లే గార్డ్‌నర్ 1 వికెట్ తీశారు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ జట్టు 7 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 17 పరుగులు చేసి.. 181 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజ్‌లో లిచ్‌ఫీల్డ్(2), పెర్రీ (11) ఉన్నారు.