Reading Time: < 1 minute

హైదరాబాద్: పంట సాగు చేయగానే ఆదాయం రాదనే విషయాన్ని రైతులకు తెలపాలని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆయిల్ పామ్ గురించి రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ అందేలా చూడటం కోసమే ఈ ప్రోగ్రాం అని తెలియజేశారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సింగూరు సమస్య గురించి లేవనెత్తారని, పాఠశాలలో డ్రింకింగ్ వాటర్ సప్లై ఆర్వో ప్లాంట్స్ ఉన్నాయా? అని..ప్రశ్నించారు. మిషన్ భగీరథతో పాటు అమృత్ స్కీం అమలు చేయాలని, పాఠశాలలో మౌలికవసతులు, వైద్యంపై దృష్టి సారించాలని వివేక్ వెంకటస్వామి అధికారులకు సూచించారు.