Reading Time: < 1 minute
Gold And Silver Rates Today 87

గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్ తగిలింది. పెళ్లిళ్ల సీజన్‌లో మళ్లీ ధరలు పెరిగిపోయాయి. కొనాలంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ. 3,160 పెరగగా.. కిలో వెండిపై రూ.10,000 పెరిగింది.

తులం గోల్డ్‌పై రూ.3,160 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,64,730 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.2,900 పెరగడంతో రూ.1,51,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,370 పెరగడంతో రూ.1,23,550 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Lottery: నక్కతోక తొక్కిన మెకానిక్.. కళ్లద్దాల రిపేర్ కోసం వెళ్లి కోటేశ్వరుడయ్యాడు

ఈరోజు సిల్వర్ ధర భగ్గుమంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధరపై రూ.10,000 పెరగడంతో రూ.2,95, 000 దగ్గర అమ్ముడవుతోంది. అలాగే హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.3,00,000 దగ్గర కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి రూ.2,95, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Drugs seized: పుష్ప రేంజ్‌లో స్కెచ్‌లు.. ఆటకట్టించిన పోలీసులు