
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కొన్ని నెలల క్రితం వచ్చి ‘చికిరి చికిరి’ అంటూ సాగే పాట తెగ వైరల్ అయింది. ఈ పాటలోని హుక్ స్టెప్ ఎంతమంది రీక్రియేట్ చేశారో లెక్కే లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో బ్లాస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. అదేంటంటే ఈ సినిమా నుంచి త్వరలో రెండో సింగిల్ రాబోతుంది.
‘‘నీ అయ్య వడ్డీ.. నీ బిడ్డ కడితే.. నువ్వేమి పొడిచావనే!! రై రై రారా రై రై రారా… ’’ అంటూ సాగే పాటని మార్చి 2న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, దివ్యేందు, జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా మార్చి 27న విడుదల కావాల్సి ఉంది. కానీ, ఇంకా కొంత భాగం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటంతో ఏప్రిల్ 30కి సినిమా విడుదలను వాయిదా వేశారు.
This song fuels the fire within 🔥🔥#Peddi second single #RaiRaiRaaRaa will be a blast 💥💥
Full Song on 2nd March.#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026@NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani… pic.twitter.com/dXANh0eXjQ
— Ram Charan (@AlwaysRamCharan) February 26, 2026