Reading Time: < 1 minute
Rajahmundry Milk Adulteration Case Health Minister Satya Kumar Issues Statement In Assembly

Rajahmundry Milk Adulteration Case: రాజమండ్రి పాల కల్తీ పై ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ అసెంబ్లీ లో ప్రకటన చేశారు… ప్రాథమిక పరీక్షల్లో యూరియా, సీరం క్రియేటిన్ స్థాయిలు పెరిగాయన్నారు. దీంతో, వరలక్ష్మి మిల్క్ డైరీ నుంచి పాల సరఫరాను నిలిపివేశాం అన్నారు సత్యకుమార్.. ఇక, మరణించిన వాళ్లు 58 ఏళ్ల పై బడ్డ పెద్దవాళ్లుగా గుర్తించాం అన్నారు. ఇద్దరు చిన్నారులు వెంటిలేటర్ పై ఉన్నారన్నారు.. సహాయక చర్యల కోసం ర్యాపిడ్‌ రెస్పాన్స్ టీమ్ ను ఏర్పాటు చేశామన్నారు సత్యకుమార్. లక్షణాలు ఉన్న కుటుంబ సభ్యులను గుర్తించే ప్రక్రియతో పాటు వైద్య సేవలు అందిస్తున్నాం అన్నారు.. మరోవైపు, నమూనాలు సేకరించి హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్న లాబ్స్ కు పంపామని.. పశువులకు ఇచ్చే మేత నాణ్యత పైనా నమూనాలను పరీక్షలకు పంపాం అన్నారు సత్యకుమార్ యాదవ్‌.. ఇక, ల్యాబ్ నిర్ధారణ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌..

Read Also: Adulterated Ghee: రేపు అసెంబ్లీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చ..

కాగా, రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఘటనలో తాజాగా మంచి రాధాకృష్ణమూర్తి, యాళ్ల శేషగిరిరావు, తాడి రమణి, తాడి కృష్ణవేణి, కనక రత్నం చనిపోయారు. అలాగే, మరో నలుగురు చిన్నారులు రాజమండ్రి పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మరో ముగ్గురు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. అయితే, రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్‌, స్వరూప్ నగర్ లో స్థానికుల అస్వస్థత, మరణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కల్తీ పాల కారణంగా అనారోగ్యం బారిన పడిన ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్షించారు. చౌడేశ్వరి నగర్‌లో ప్రజలు అనారోగ్యం పాలవ్వడం, పలువురు మరణించడంపై వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం బాధితులకు అందుతున్న వైద్యసాయాన్ని అధికారులు సీఎంకు వివరించారు. చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని చంద్రబాబు సూచించారు.