
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా. మధ్యప్రదేశ్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెబుతున్నాను.. అంటూ కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే విడుదల చేసిన రాజీనామా లేఖ తీవ్ర దుమారం రేపుతోంది. అదేంటి దీప్కే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎప్పుడు అయ్యారని అనుకుంటున్నారా..? సోషల్ మీడియాను మరోసారి యాక్టివ్ చేసిన దీప్కే పోస్టు గురించి తెలుసుకుందాం.
2026 సెప్టెంబర్ 13న దీప్కే విడుదల చేసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తున్నానని దీప్కే రాజీనామా లేఖను విడుదల చేశారు. లెటర్ హెడ్ లో అభిజీత్ దీప్కే, చీఫ్ మినిస్టర్, మధ్యప్రదేశ్ పేరున గవర్నర్ కు రాజీనామా లేఖ పంపిస్తున్నట్లు లేఖ విడుదల చేశారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో డిబేట్ జరుగుతోంది.
లేఖలో ఏముంది..?
మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ కు రాసిన లేఖలో, దీప్కే వ్యంగ్యంగా ఆ మరణాలకు తానే బాధ్యత వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఆరోగ్యం, తాగునీరు, విద్య, ఇతర రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని.. బాధ్యతగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్ననట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
బాలాఘాట్‌లో 30 మందికి పైగా గిరిజన పిల్లలు మరణించిన తర్వాత, ఈ పదవిలో కొనసాగడానికి నా అంతరాత్మ అంగీకరించడం లేదు, అని దీప్కే రాశారు. ఆ మరణాలకు బాధ్యత వహిస్తున్నట్లు సెటైరికల్ గా పేర్కొన్నారు.
బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అందించిన పరిహారం విషయంలో ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని కూడా దీప్కే విమర్శించారు. గిరిజన వర్గాల నిరసనల తర్వాతే పరిహారం రూ. 2 లక్షల నుండి రూ. 4 లక్షలకు పెంచినట్లు గుర్తు చేశారు. ఒకవేళ ఆ పిల్లలు మంత్రులు లేదా ఎమ్మెల్యేల పిల్లలై ఉంటే, ఇదే పరిహారం మొత్తాన్ని సరిపోతుందని భావించేవారా అని ఆయన ప్రశ్నించారు.
అమాయక పిల్లల మరణాలకు అత్యున్నత స్థాయిలో బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, ఆరోగ్య శాఖ అధికారులను బాధ్యులను చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
విద్య, విద్యుత్, పోషకాహారం, గిరిజన తెగలపై నేరాలకు సంబంధించిన అంశాలలో ఉన్న లోపాలను కూడా దీప్కే తన పోస్ట్‌లో ప్రస్తావించారు. ఇందుకోసం ఆయన ప్రభుత్వ, NCRB గణాంకాలను కోట్ చేశారు.
నేను కేవలం బాలాఘాట్ గిరిజనులకే కాకుండా, రాష్ట్రంలోని గిరిజనులందరికీ అన్యాయం చేశాను. ఇంతమంది అమాయక పిల్లలను కోల్పోయిన తర్వాత, ఈ పదవిలో కొనసాగే నైతిక హక్కు నాకు ఉందని నేను భావించడం లేదు,అని రాజీనామా లేఖలో దీప్కే రాశారు. బాధ్యతల నుంచి తప్పించుకుని పారిపోతున్నారని.. దీనికి సీజేపీ స్పోక్ పర్సన్ అశుతోష్ రాంక కామెంట్ చేశారు.
లెటర్ రాయటానికి ముందు ఏం జరిగింది..?
మధ్యప్రదేశ్ బాలాఘాట్ లో 30 మందికి పైగా గిరిజన బాలలు చనిపోవడంతో పరామర్శించేందుకు 2026 సెప్టెంబర్ 12న వెళ్లిన దీప్కేకు చేదు అనుభవం ఎదురైంది. పిల్లలు ఎప్పటి నుంచి చనిపోతున్నారు.. మీరు ఎప్పుడు వచ్చారు..? ఇన్నాళ్లు పట్టిందా..? ఇప్పటి వరకు ఎందుకు రాలేదు..? ఇప్పుడు ఎందుకు వచ్చారు..? ఈ అంశంపై రాజకీయం చేయటానికి వచ్చారా..? మీకు రాజకీయం చేసేందుకు కంటెంట్ దొరికిందా..? అంటూ మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు దీప్కేపై విరుచుకుపడ్డారు. ఫటా ఫటా ప్రశ్నలు సంధించారు. ఆలస్యం అయినందుకు క్షమాపణలు చెబుతున్నా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు సీజేపీ ప్రతినిధులు. పారిపోయారు.. తప్పించుకు పోయారు అంటూ మీడియా ప్రతినిధులు కామెంట్స్ చేయటం వినవచ్చు.
రాజీనామా లేఖతో ఒక్కసారిగా చర్చ..
ఘటనా స్థలం నుంచి వెళ్లిన అభిజీత్ దీప్కే.. సడెన్ గా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజీనామా లేఖ విడుదల చేయడం దుమారం రేపుతోంది. 30 మంది గిరిజన బాలల మృతికి బాధ్యతగా రాజీనామా చేస్తున్నట్లు ఎక్స్ లో సెటైరికల్ రిజిగ్నేషన్ లెటర్ రిలీజ్ చేశారు దీప్కే. ఇది ఫేక్ లెటర్ అయినప్పటికీ ప్రభుత్వ రాజముద్ర, సీఎంఓ చిరునామా, సంతకంతో వ్యంగ్యాత్మకంగా లెటర్ రిలీజ్ చేశారు.
अच्छा किया MP के मुख्यमंत्री पद से @abhijeet_dipke ने इस्तीफा दे दिया है . अब उनकी जगह मोहन यादव कमान संभालेंगे तो सब चंगा हो जाएगा.
तत्काल प्रभाव से दीपके का इस्तीफा स्वीकार हो . माइक लेकर दीपके के पीछे दौड़ने वाले रिपोर्टर अब उनका पीछा छोड़ दें . https://t.co/OzSLKg7mQ1— Ajit Anjum (@ajitanjum) September 13, 2026
సోషల్ మీడియాలో రచ్చ:
దీప్కే విడుదల చేసిన ఫేక్ లెటర్ పై సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారింది. ఒక ముఖ్యమంత్రి పేరుతో లేఖను రిలీజ్ చేసి ప్రభుత్వాన్ని అవమానించారని, దీప్కేపై కేసు నమోదు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీప్కేపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.
మరోవైపు అభిజీత్ దీప్కే సీఎం రాజీనామా లేఖ వైరల్ గా మారింది. చాలా మంది దీప్కే సెటైరికల్ లేఖకు మద్ధతు ఇస్తున్నారు. దీప్కే టైమింగ్, స్పాంటెనిటీతో మరోసారి సోషల్ మీడియా తేనె తుట్టెను కదిపారని అంటున్నారు. ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రశ్నలు.. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వాళ్లపై సంధించడమేంటని యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు.
గోదీ మీదియా ఇవే ప్రశ్నలు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ను అడగగలదా. దేశంలో, రాష్ట్రంలో ఎన్నో సమస్యలుంటే మీడియా అసలు పట్టించుకోదు. ఎప్పుడూ బీజేపీ ప్రభుత్వాలను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించాల్సిన మీడియా సీజేపీ ప్రతినిధులపై పడటమేంటని తీవ్ర స్థాయిలో సీజేపీకి మద్ధతుగా కామెంట్స్ పెడుతున్నారు.
మొత్తానికి సీఎం పదవికి దీప్కే రాజీనామా చేశారు. ధైర్యం ఉన్న మీడియా విద్యార్థులు, స్కూళ్ల నిర్వహణపై చాలా ధైర్యంగా ప్రశ్నలు అడిగిందని సెటైర్లు వేస్తున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినందుకు ధన్యవాదాలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. చూడాలి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో.