Reading Time: < 1 minute
సిబ్బందిపై కారం చల్లి బ్యాంకులో దోపిడీ..

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సినిమా ఫక్కీలో బ్యాంకు దోపిడీ జరిగింది.స్థానిక ఎస్‌బీఐ బ్యాంకు బ్రాంచ్‌లోకి ప్రవేశించిన ఓ దుండగుడు, సిబ్బంది కళ్లలో కారం చల్లి రూ. 4 లక్షల నగదుతో పరారయ్యాడు. అయితే, పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి కేవలం 30 నిమిషాల్లోనే నిందితుడిని పట్టుకుని చోరీ సొత్తును పూర్తిగా రికవర్ చేశారు. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ముఖానికి గుడ్డ చుట్టుకుని, ఎర్రటి కుర్తా ధరించిన వ్యక్తి బ్యాంకులోకి వచ్చాడు. నేరుగా క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి సిబ్బంది కళ్లలో కారం పొడి విసిరాడు. వారు మంటతో బాధపడుతుండగానే, కౌంటర్‌లోని నగదును తీసుకుని పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితుడు పారిపోయిన మార్గాన్ని గుర్తించి నగరవ్యాప్తంగా చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో నిందితుడిని వేగంగా పట్టుకున్నారు. నిందితుడిని నాగ్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల సూరజ్ బోర్కర్‌గా గుర్తించారు. అతను నిరుద్యోగి అని తేలింది. అతని వద్ద నుంచి మొత్తం రూ. 4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరగంటలోనే దొంగను పట్టుకున్న పోలీసుల తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కన్నబిడ్డల పట్ల కర్కశంగా మారుతున్న తల్లిదండ్రులు.. ఎందుకు?

Neena Gupta: 67ఏళ్ల వయసులో ప్రెగ్నెంటా..? ఇచ్చిపడేసిన ఒకప్పటి హీరోయిన్

Epic: ఎపిక్‌ సూపర్ కలెక్షన్స్‌.. డే1 ఎంతంటే?

Hanuman Ansh: త్రివిక్రమ్ తీసుకొస్తున్నారు సరే తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారు?

ఏఐతో మానవాళికి పెను ప్రమాదం.. పదేళ్లలో పదిశాతం జన నష్టం?