
ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఎస్ఏసీ) జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్- పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 10న ప్రారంభం కాగా సెప్టెంబర్ 30 వరకు అప్లై చేయవచ్చు.
మొత్తం ఖాళీలు: 48.
విభాగాల వారీగా ఖాళీలు: జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) 33, రీసెర్చ్ అసోసియేట్(ఆర్ఏ) 8, ప్రాజెక్ట్ సైంటిస్ట్ –I (పీఎస్–I) 7.
విద్యార్హత
జేఆర్ఎఫ్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ లేదా ఎంఈ/ ఎం.టెక్/ ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి. అలాగే, సీఎస్ఐఆర్– యూజీసీ నెట్, గేట్ క్వాలిఫై అయి ఉండాలి.
ఆర్ఏ/ పీఎస్-–I: సంబంధిత విభాగంలో ఎంఈ/ ఎంటెక్, పీహెచ్డీ పూర్తిచేసి ఉండాలి.
వయసు (2026, సెప్టెంబర్ 30 నాటికి):
* జేఆర్ఎఫ్ పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.
*ఆర్ఏ/ పీఎస్–I పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.sac.gov.inను సందర్శించండి.
►ALSO READ | టెన్త్, డిగ్రీ అర్హతతో ఎస్సై నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 1871 పోస్టులు.. మహిళలకూ కూడా అవకాశం!