
హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్న బీదర్ (ప్రస్తుత కర్ణాటక)లో అభివృద్ధి చెందడం వల్ల ఈ కళకు బిద్రి అనే పేరు వచ్చింది. ఈ కళ ఇరాన్ నుంచి హైదరాబాద్ రాష్ట్రానికి వలస వచ్చింది. సుల్తాన్ అహ్మద్ షా ఈ కళను పర్షియా నుంచి ఇండియాకు తెచ్చాడు.
కాపర్ & జింకుల మిశ్రమం (గన్ మెటల్)తో తయారు చేసిన వస్తువులపై మొదట నల్లరంగు వేసి దానిపై బంగారు లేదా సిల్వర్తో డిజైన్స్ వేస్తారు. (కాపర్ + జింక్ + సిల్వర్). అలంకరణ వస్తువులు, ఫ్లవర్ వాజ్లు, నగల డబ్బాలు, సిగార్ వంటి ఎన్నో వస్తువులు తయారుచేస్తారు.
తెలంగాణలోని ఆశ్రిత కులాలు
మధ్యయుగంలో తెలంగాణలో ఉన్న కులాలపై ఆధారపడి, కుల కీర్తనం, వంశ కీర్తనం చేస్తూ ఆ కులాల దగ్గర యాచించి బతుకు సాగించే కొన్ని ఉపకులాలు ఆవిర్భవించాయి. వీటిని ఆశ్రిత కులాలు అంటారు. వీరు ఏ కులం దగ్గర యాచిస్తారో వారిని బట్టి వీరిని ఒక్కో పేరుతో పిలుస్తారు.
కులం ఆశ్రిత కులం
యాదవులు మందెచ్చువారు, ఒగ్గువారు
పద్మశాలీలు సాధనాశూరులు, కూనపులివారు
ముదిరాజ్/ ముత్రాసి పాండవులవాళ్లు
రాజులు భట్రాజులు
మాదిగలు డక్కలి, తప్పెట, భాగవతులు
బుడగజంగాలు కాటిపాపలు, పెద్దమ్మలోళ్లు
రెడ్డి, కమ్మ పిచ్చకుంట్లవారు
బ్రాహ్మణులు విప్రవినోదులు
కోమట్లు వీరముష్టివారు
విశ్వబ్రాహ్మణులు రుంజవారు
రజకులు పటంవారు
కుమ్మరి పెక్కర్లు
ముదిరాజులు కాకిపడగలవారు
పెరుకలు వరుసభట్టులు
గామల్ల యానాదులు
మాలలు ముష్టిగ