Reading Time: < 1 minute

టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న భారత్.. ఆఫ్ఘనిస్థాన్‌తో పోరుకి వైభవ్ ఔట్.. సంజు ఇన్

Caption of Image.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ప్రారంభమైన తొలి టీ20 పోరులో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఛేజింగ్ చేయడం సులువన్న అంచనాతోనే బౌలింగ్ తీసుకున్నట్లు అయ్యర్ స్పష్టం చేశాడు. తుది జట్టులో జస్ప్రీత్ బుమ్రా పునరాగమనంతో ఇండియన్ బౌలింగ్ పటిష్టం అయింది. ఇక 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీని బెంచ్ కే పరిమితం చేసి, వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్ కి తుది జట్టులో అవకాశం కల్పించారు. 

భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఢిల్లీ వికెట్‌పై తొలుత బౌలింగ్ చేయడం మంచిది.. జింబాబ్వే సిరీస్ నుంచి ఎన్నో పాజిటివ్స్‌ను ఈ సిరీస్‌కు మోసుకొచ్చాం.. బుమ్రా రూపంలో మా వద్ద నిఖార్సయిన మ్యాచ్ విన్నర్ ఉన్నాడని శ్రేయస్ పేర్కొన్నాడు.

ఆఫ్ఘన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ మాట్లాడుతూ.. తాము కూడా టాస్ గెలిస్తే బౌలింగే ఎంచుకునేవాళ్లమని, అయితే ఇప్పుడు బోర్డుపై భారీ స్కోరు ఉంచి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చాడు. ఇక తమ జట్టులో సీనియర్ ఆటగాళ్లతో పాటు యువకులు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపాడు. 

భారత జట్టు: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి

ఆఫ్ఘనిస్తాన్ జట్టు: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ ( వికెట్ కీపర్), సెదిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్హాకర్ ఫర్

©️ VIL Media Pvt Ltd.