Reading Time: < 1 minute
Khairatabad Bada Ganesh 69 Feet Panchamukha Sankatahara Ganapathi

ఖైరతాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహ నిర్మాణం పూర్తైంది. ఈసారి పంచముఖ సంకటహర మహాగణపతి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. 69 అడుగుల ఎత్తుతో ఐదు పడగలు, పంచముఖాలతో గణపతి రూపాన్ని తీర్చిదిద్దారు. విగ్రహ నిర్మాణం పూర్తవడంతో బడా గణేష్‌ను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

పంచముఖ సంకటహర మహాగణపతి

ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి విభిన్న రూపంలో భక్తులను ఆకట్టుకోనున్నాడు. 69 అడుగుల ఎత్తుతో ఐదు పడగలు, ఐదు ముఖాలతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహాగణపతికి ఒకవైపు సోమనాథ్ జ్యోతిర్లింగం, మరోవైపు కాళికామాత విగ్రహాలను ఏర్పాటు చేశారు. దీంతో ఖైరతాబాద్ బడా గణేష్ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

బడా గణేష్ వద్ద భక్తుల సందడి

విగ్రహ నిర్మాణం పూర్తవడంతో ఖైరతాబాద్ పరిసరాల్లో సందడి నెలకొంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో బడా గణేష్‌ను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భారీ వాహనాలు రాకుండా పరిసర ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు.

మూడంచల పోలీస్ భద్రత

బడా గణేష్ వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడంచల భద్రతతో పాటు షీ టీమ్స్, క్రైమ్ మఫ్టీ పార్టీ, క్విక్ రియాక్షన్ టీమ్, సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్, సిటీ టాస్క్‌ఫోర్స్ బలగాలను మోహరించారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో అడుగడుగునా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.