Reading Time: < 1 minute
Motorola Edge 70 Neo Specs Geekbench

మోటోరోలా నుంచి భారత మార్కెట్లోకి త్వరలో రానున్న ‘మోటోరోలా ఎడ్జ్ 70 నియో’ ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు గీక్‌బెంచ్ ద్వారా వెల్లడయ్యాయి. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 (మార్కెటింగ్ పేరు, చిప్‌సెట్ కోడ్ QTI SM7635) ప్రాసెసర్ ఉండగా.. ఇదే చిప్ ఎడ్జ్ 70 ప్లస్‌లో కూడా ఉంది. ఇది గ్లాబల్ వెర్షన్‌కు రీబ్రాండెడ్ వేరియంట్ అయి ఉండొచ్చని అంచనా.

గీక్‌బెంచ్ టెస్ట్‌లో సింగిల్-కోర్‌లో 723 పాయింట్లు, మల్టీ-కోర్‌లో 2,,943 పాయింట్లు సాధించింది. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌లో 4 కోర్లు 1.80GHz, 3 కోర్లు 2.40GHz, 1 ప్రైమ్ కోర్ 2.50GHz క్లాక్ స్పీడ్‌తో పని చేస్తాయి. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 810 జీపీయూను ఇచ్చారు. ఇది 6GB రామ్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌పై నడుస్తుంది. గేమింగ్ కంటే రోజువారీ సాధారణ వాడకానికి ఈ మిడ్-రేంజ్ చిప్ చక్కగా సరిపోతుంది.

డిజైన్ పరంగా, ఇది దాదాపు 6.3 అంగుళాల కాంపాక్ట్ డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 17తో ప్రీ-లోడెడ్ వచ్చే మొదటి మోటోరోలా ఫోన్ ఇదే కావచ్చని అంచనా. లీకైన సమాచారం ప్రకారం పింక్, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, లైట్ బ్లూ అనే నాలుగు ఆకర్షణీయమైన కలర్స్ లో ఇది లభిస్తుంది. వెనుకవైపు 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా అమర్చినట్లు తెలుస్తోంది. డిస్‌ప్లే, బ్యాటరీ వంటి పూర్తి వివరాలను కంపెనీ త్వరలో ప్రకటించనుంది. ధరల పరంగా రూ.2,500 ఈఎంఐ ఆప్షన్లతో దీన్ని మార్కెట్లోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ ధరలోనే ఈ ఫోన్ రిలీజ్ అవ్వనున్నట్లు సమాచారం. రోజువారీ అవసరాలకు తగిన కాంపాక్ట్, స్టైలిష్ ఫోన్ కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది.