
బ్రిక్స్ సదస్సు సందర్భంగా వివిధ దేశాధినేతలకు, అతిథులకు ఏర్పాటు చేసిన మెనూపై వివాదం మొదలైంది. మెనూ మొత్తం శాఖాహారంతో నింపడంపై విమర్శలు వస్తున్నాయి. లేటెస్టుగా బ్రిక్స్ మెనూపై 2026 సెప్టెంబర్ 13ప రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన గాలా డిన్నర్ లో దేశాధినేతలకు వెజిటేరియన్ మెనూ పెట్టడంపై మోదీ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ చురకలు అంటించారు. భారత్ లో 80 శాతం మంది మాంసాహారులు ఉంటే శాకాహారం మెనూ పెట్టడమేంటని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
భారత్ లో 80 శాతం మంది నాన్ వెజిటేరియన్సే.. ఇండియాలో వండే మాంసాహారం రుచికరంగా ఉంటుంది. మా సోదరి చేసే చోలే బతూరే లాగ.. అంటూ చేసిన ట్వీట్ పెద్ద డిబేట్ కు కారణమైంది.
ఆహారపు అలవాట్లను ప్రజలపై రుద్దటం బీజేపీకి అలవాటే. దీంతో దేశంలో ఇప్పటికే సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఏకంగా దేశాధినేలపై కూడా తమ ఆహార అలవాట్లను రుద్దుతున్నారని ట్వీట్ ద్వారా విమర్శించారు.
రాహుల్ గాంధీ ట్వీట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ పవన్ ఖేరా కేంద్రంపై ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అతిథులకు తమ ఆహార ప్రాధాన్యాలను రుద్దటమేంటని ప్రశ్నించారు. అన్ని రకాల ఆహారాలను అందుబాటులో ఉంచితే నచ్చినవి తింటారని.. కానీ దేశాధినేతలపై శాఖాహారాన్ని రుద్దటమేంటని అన్నారు.
ప్రపంచంలో ఉన్న వంటకాలన్నింటిలో ఇండియాలో చాలా వైవిధ్యమైన, రుచికరమైన, అద్భుతమైన వంటలున్నాయని ఖేరా అన్నారు. అలాంటి అద్భుతమైన నాన్ వెజ్ ను మెనూలో ఎందుకు ఉంచలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ విమర్శలపై కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు స్పందించారు. ఫుడ్ మెనూను కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. అతిథులు శాఖాహార మెనూను ఇష్టపడ్డారని.. దేశంలోని వివిధ ప్రాంతాల శాఖాహార సంస్కృతిని చాటి చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.